సెప్టెంబరు 17 విశ్వకర్మ జయంతి - జాతీయ కార్మిక దినోత్సవము

విశ్వకర్మ ఉన్నత స్థాయికి చెందిన శిల్ప శాస్త్రజ్ఞుడు. తొలి ఇంజనీరు. సమాజ జీవనానికి సంబంధించిన వివిధ అవస రాను దృష్టిలో ఉంచుకొని న అసామాన్య ప్రతిభతో అనేక రకా పరికరాను యంత్రాను రూపొందించాడు. విశ్వకర్మ మన పూర్వీకుడు అయినందుకు భారతీయులంతా గర్వించాలి. విశ్వకర్మ రూపొందించిన పనిముట్లతో స్వయం నిర్వహణతో కొనసాగిన వృత్తి పనుతో కూడిన పటుతర మైన ఆర్థిక వ్యవస్థ విసిల్లింది. ప్రతి కుటుంబం తమదైన వృత్తి పరిశ్రమను నిర్వహించేది. వ్యవస్థీకృతమైన కుటుంబ పరిశ్రమ పరంపర విశ్వకర్మ నుంచే మొదయ్యింది. శ్రమకు సాధన జోడైతే, దానితో సమర్పణ భావం సమన్వయమైతే సమాజంలో సంపదలు వెల్లువెత్తుతాయి. శ్రమ న సంపద సమకూరుతుంది. శ్రమయే యజ్ఞం. మన దేశ సంపూర్ణ వికాస సాధనలో పనిచేస్తున్న వారంతా విశ్వకర్మను స్మరించడం అనుసరించడం అవసరం.

విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ జరుపుతోంది. జాతీయాభ్యుదయానికి బహుముఖ కృషి అవసరం. కార్మికోద్యమాలు జాతి ప్రగతిసాధనకు అనురూపగా రూపొందించటం కోసం భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ అంకితమైంది, కార్మికును సంఘటితం చేస్తు వారినొక ప్రచండ శక్తిగా నిలిపి తన, మన, ధనాలతో ఈ దేశ పరమ వైభవము కోసం, ఈ జాతిని స్వయం సమృద్ధంగా, స్వావలంబితంగా నిలిపేందుకు కార్మికశక్తిని జాగృతం చేయాన్నది భారతీయ మజ్దూర్‌సంఘ్‌ సంకల్పం. సంకల్పం, త్యాగం, తప, బలిదానా పునాదిపై కార్మికొద్యా మాను నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ గుణాకు ప్రతిరూపమైన భగవాన్‌ విశ్వకర్మను తన ఆదర్శానికి ప్రతీకగా భావిస్తోంది. విశ్వకర్మ జయంతి అయిన సెప్టెంబరు 17 యావత్తు దేశము కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలి.జాతి పునర్వైభవం కొరకు జరిగే అన్ని ప్రయత్నాలో మా శ్రమకు, శ్రామికుకు ఎంతో మహత్తర పాత్ర ఉన్నది. ఈ కర్తవ్యాన్ని శ్రామికలోకంలో నిరంతరం జాగృతం చేస్తూ, కార్మిక సోదరుకు క్ష్య నిర్దేశం చేయటానికి విశ్వకర్మ జయంతి ప్రేరణగా నిలుస్తుంది.