కష్టాల సాక్షిగా.. విజయసింధూరాలు
విజయము కోరి విసుగును వీడి..

విరామమెరుగక పనిచేయాలి..

అసాధ్యమనేది అసలే లేదని

చరిత్ర నేర్పదే పవిత్ర పాఠం..
చరిత్ర సృష్టించాని కోరుకున్నప్పుడు అందుకు తగినట్టుగానే కష్టపడాలి. క్ష్యంపై దృష్టి పెట్టాలి.  ఇప్పుడు చెప్పబోయే ఇద్దరమ్మాయిలు అదే పని చేశారు. చరిత్ర సృష్టించారు. భారత్‌ కీర్తి పతాకాన్ని నలుదిశకూ వ్యాపింపచేశారు. వారే రియే ఒలంపిక్స్లో కాంస్యపతకం రజత పతకం సాధించిన సాక్షిమాలిక్‌, పీవీ సింధూలు. ఆడవాళ్లు మీరేం చేయగరు అని చిన్న చూపు చూసినవారికి తమ ఆటతీరుతోనే గట్టి సమాధానమిచ్చారు ఈ ఇద్దరు. వారి బాటలోనే ప్రయాణం చేస్తూ కొద్దిపాటిలో పతకంను చేజార్చుకుంది జిమ్నాస్టిక్స్‌ విభాగంలో  దీపా కర్మాకర్‌. ఇక మహారాష్ట్రకు చెందిన లితా బాబర్‌ రన్నింగ్‌లో వేగంగా పరిగెత్తి టాప్‌ టెన్‌లో ఒకరిగా నిలిచింది. వీరంతా కూడా మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారు. కొందరిదైతే  తినడానకి తిండి కూడా లేని  పరిస్థితి. అయినప్పటికీ ఇలా వివిధ అంశాలో తమ ఆటకు పదను పెడుతూ పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా తమ వంతుగా సాయశక్తులా కృషి చేసిన మగువలు చాలా మందే ఉన్నారు. వారందరికీ జోహార్లు.
సాక్షిమాలిక్‌
అసలు భారత్‌రియో ఒంపిక్స్లో బోణీ ఎప్పు డు కొడుతుందా? ఒక్క పతకమైనా దక్కుతుందా? మనవాళ్ల కంత సీనుందా? అంటూ విమర్శించే వారికీ, అటు ఆశగా పతాకం కోసం ఎదురుచూస్తున్న భారత ప్రజ ఆశను నిజం చేసింది సాక్షి మాలిక్‌. రియో ఒంపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించి రాఖీ పండుగనాడు  లంపిక్‌  పతకాన్ని  దేశ ప్రజకు కానుకగా అందించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన మొదటి మహిళా రెజ్లర్‌గా ఒలంపిక్స్‌ లో భారత్‌కు పతకాన్ని తీసుకొచ్చిన మహిళా క్రీడాకారిణిగా రికార్డ్ను నెకొల్పింది. సాక్షి పుట్టింది హర్యానాలోని  ఓ మారుమూ పల్లెటూరు ..తనకి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. పన్నెండేళ్ల వయసులో ఈశ్వర్‌ దహియా వద్ద రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు చేరింది. అయితే ఆమె ఉన్న ప్రాంతంలో మాత్రం ఈ కుస్తీని ఎక్కువగా అబ్బాయిలు మాత్రమే ఆడేవారు. ఈ ఆటను సాధన చేయాన్నా, సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాన్నా అబ్బాయితో పోటీ పడాల్సిందే. ఈక్రమంలో ఆమెకు స్థానికులూ, బంధువు నుంచి విమర్శలు ఎదురయ్యారు. ఈ సమయంలో తల్లిదండ్రులు కోచ్‌ ఈశ్వర్‌ ఆమెకు అండగా నిలిచారు. కుస్తీ అనేది సాహసక్రీడ. తనతో పోటీపడే అబ్బాయితో కుస్తీ పట్టి వారిని మట్టికరిపించేది. సాక్షితో పట్టు పట్టడాని కి ఆ ప్రాంతంలోని  అబ్బాయిలు సైతం భయంతో వణికిపోయే వారట..ఇలా అనేక అడ్డంకు నడుమ 23యేళ్ల సాక్షి అంచలంచెలుగా తన ప్రతిభను చాటుతూ నేడు అత్యుత్తమ పతకమైన ఒంపిక్స్‌ పతకాన్ని సాధించి యావత్‌ దేశ ప్రజకు సగర్వంగా అంకితమిచ్చింది.. క్వార్టర్స్‌ లో మన సాక్షి రష్యాకు చెందిన వలెరియా కొట్లొవాపై ఓడిపోయింది. రష్యా రెజ్లర్‌ పైనల్‌కు వెళ్లింది.క్వార్టర్స్లో గెలిచిన ప్రత్యర్థి ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. అందులో ఓడిన వారికి కాంస్య పతకం కోసం పోరాడే చాన్స్‌ దొరుకుతుంది. రెజ్లింగ్‌ అంత సులువు కాదు కాబట్టి ఇందులో నలుగురికి పతకాలు ఇస్తారు. దీనినే రెప్‌ఛేజ్‌ అంటారు. ఈ పద్దతిలోనే సాక్షి విజయం సాధించింది.
పివి సింధు
భారత బ్యాట్మింటన్‌ చరిత్రలో ఓ తెలిగింటి అమ్మాయి సువర్ణాక్షరాను రాసింది. తెలుగు రాష్ట్రాలో ఇప్పుడు ఎవ్వరినోట చూసినా సింధూ అన్నమాటే. రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌లో రజత పతకం కైవసం చేసుకుని ఒలింపిక్స్‌ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్‌ సృష్టించింది  సింధు. ఆమె సాధించిన ఆ అపూర్వమైన విజయానికి దేశమంతా జేజేలులుకుతోంది. ఈ విజయం వెనుక ఎన్నో వెకట్టలేని త్యాగాలు..అంతకు మించిన శ్రమ దాగుంది. ఈ శ్రమకు కారణం గోపిచంద్‌ అకాడమీనే. పదేళ్ల వయసు నుంచే రాకెట్‌ను చేతిలో బట్టుకుని గోపీచంద్‌ అకాడమీలో ఆడుగుపెట్టింది సింధు. ప్రతి రోజు ఉదయం నాలిగింటి కల్లా అకాడమీకి వచ్చేది. ఒంపిక్స్‌ మొదవడానికి సుమారు మూడు నెల ముందు నుంచి మరింత కష్టపడింది. కోచ్‌ సూచన మేరకు సోషల్‌ మీడియాకు, ఫోన్‌కి దూరంగా ఉంది. తద్వార తనలో ఏకాగ్రత మరింత పెరిగిందని చెబుతోంది ఈ అమ్మాయి. ఫలితంగా ఆటపై మరింత దృష్టిసారించడానికి తోడ్పడిందట. అంతేకాకుండా తనకిష్టమైన ఆహారాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందంటోంది ఈ అమ్మాయి. కేవలం తల్లిదండ్రు ప్రోత్సాహం, గురువు శిక్షణ, శ్రమ, దైవానుగ్రహం వల్లనే ఈ విజయాన్ని సాధించానని అంటోంది సింధు. భవిష్యత్తులో అమ్మాయిలు మరింత ముందుకు రావాలంటే తల్లిదండ్రు ప్రోత్సాహం, తగిన ఏర్పాట్లు తప్పనిసరనిగా ఉండాలంటోంది. టోక్యో ఒలంపిక్స్లో స్వర్ణం సాధించడమే తన క్ష్యం అని చెబుతోంది ఈ తెలుగమ్మాయి.