ఏకాత్మ మానవతావాదం మరియు గ్రామ వికాసం

భారత్‌లో వ్యవసాయంపై ఆధారపడి జీవించడం అనాదిగా వస్తున్నదే. నీటి అవసరం ఎక్కువ లేని పంటను మొదట్లో పండిరచే వారు. దేశంలోని భిన్న భిన్న ప్రాంతాలో పాకులు తక్కువ వర్షం కురిసినా కరువురాని విధంగా వ్యవసాయానికి వ్యవస్థ చేసేవారు. కాని విదేశీ పాకు కాలంలో ఈ వ్యవస్థను విచ్ఛినం చేయడం జరిగింది. కొత్త వ్యవస్థలు ఏర్పడలేదు. దార్శనికుడు పండిత్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఈ విషయాన్ని ఏభైఏళ్ళ క్రితమే గ్రహించారు. ఆయన కేవం వర్షాభావ పరిస్థితినే కాక వ్యవసాయంతో ముడిపడిఉన్న అనేక విషయా పై అధ్యయనం చేశారు. నాడెందరో విశేషజ్ఞు కూడా ఆశ్చర్యపోయారు. దేశంలో నాడున్న ప్రముఖ రాజకీయ సంస్థకు సంఘటన పరంగా, సిద్ధాంతపరంగా ముఖ్యుడాయన.

పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఆయన జీవిం చిన తక్కువ కాలంలోనే ఈ సమాజం యొక్క సమగ్ర అభివృద్ధికి ఎకాత్మమానవతా వాదాన్ని ప్రస్తుతించారు. దేశంలో, ప్రపంచంలో ఈ సిద్ధాంతం బాగా ఆదరించబడింది. మనష్యుల్ని విభిజించి కాకుండా సంపూర్ణ మానవునిగా చూడాలి. శరీరం, మనస్సు ఆత్మ సమగ్ర చింతన అవసరం. బ్రహ్మండ మంతా ఒకే భావనతో చూడాలి. పంచభూతాలైన ఆకాశము, భూమి, జలం, వాయు, అగ్నిల సమన్వ యంతో జీవించాలి. ప్రకృతిపట్ల గౌరవభావన కల్గి ప్రకృతిని పోషించే గుణముండాలి. క్రమంగా ఈవాదం ఏకాత్మమానవ దర్శనంగా ప్రచారంలోకి వచ్చింది. పండిట్‌జీ ఆలోచన ప్రకారం మనిషికి ఆత్మ ఉన్నట్లే దేశానికి కూడా ఆత్మ ఉంటుంది. దీన్నే చితి అంటారు. భారతదేశం ఆత్మ గ్రామాలో వుంటుందని, గ్రామ వాసి మాత్రమే దేశం ఆత్మయొక్క ప్రతినిధి అనీ, కనుక దేశం వికసించాలంటే గ్రామా సర్వాంగణ వికాసం జరగాని ఇందులో వ్యవసా యం అభివృద్ధి జరగాని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ భావించేవారు. ఇందుకు తగినంత అధ్యయనం కూడా ఆయన చేసేవారు. వ్యవసాయం గురించి వారు చెప్పిన విషయంలో వ్యవసాయం కేవలం ప్రకృతిమీదనే ఆధారపడి చేయకూడదని ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరమనీ అన్నారు.  వ్యవసా యం ఓ సమగ్ర దృక్పథంతో చూడాన్నారు. దేశంలో వ్యవసాయ దారుకు వ్యవసాయ పద్ధతుపై గ అవగాహన రిస్థితుకనుగుణంగా వికసింపజేసిన దని, వీటిని ఉన్నపళంగా విడిచిపెట్టకూడదని అనే వారు. భారత్‌లో వ్యవసాయదారుకు ఏ పంటలు వేయాలి, ఎరువు నెవాడాలి, సేంద్రియ ఎరువుతో భూసారం ఎలా పరిరక్షించుకోవాలి, వృక్షాను పెంచడం వంటి విషయాలు బాగా తెలుసు. వారు యుగాలుగా  భూసారం పరిరక్షించుకుంటూ వస్తున్నారు. కాని అనేక కారణా వల్ల వారు తమ విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోయారు అనేవారు దీన్‌దయాళ్‌జీ. పశుపాన వ్యవసాయంలో భాగమనేవారు పండిట్‌జీ. పశువు వల్ల పాలే కాదు పశుసంతతి వ్యవసాయానికి ఉపయోపడుతుంది. వ్యవసాయానికి ఉపయోగపడని ఎద్దును కూడా ఈ దేశంలో పోషించేవారు. కాని పాశ్చ్యాతి దేశావాళ్ళు గోమాంసాన్ని భక్షించేవారు. ఎద్దును కూడా  చంపితినేవారు. భారతీయ చింతన ప్రకారం, వీటి అజ్ఞానం అతివ్యవహారంగా అనబడుతుంది. నేడున్న కృషి వైజ్ఞానికులో ఓ బమైన వర్గం కూడా  పరంపరాగతంగా వస్తున్న వ్యవసాయ పద్ధతులే భారత్‌కు అనుకూమంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా అనేక సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. రసాయనిక ఎరువు వాడకంపై కూడా చర్చ జరుగుతోంది. ఏభై ఏళ్ళ క్రితమే దీనదయాళ్‌జీ పంటకు ఎరువు అవసరం వుందని, కానీ భూసారం, పంటపద్ధతి, వేసే పంట, నీటి వ్యవస్థ వంటి సర్వేక్షణ చేసిన తరువాతే ఎరువును ఉపయుక్తంగా దిగుబడి పెంచేందుకు వాడాని చెప్పారు. కృషివైజ్ఞానికువైపు నుంచి కూడా ఆయన అధ్యయనం చేశారు. విత్తనా నాణ్యత, పంటమార్పిడి వంటి విషయాపై పాకును అప్రమత్తం చేశారు. విదేశా నుంచి వచ్చే విజ్ఞానానికి ఆయన వ్యతిరేకం కాదు.  విదేశీయు వ్యవసాయ పరీక్ష లాభం మనం పొందవచ్చు కాని అనుకరించనక్కరలేదు అనేవారాయన. మనకు బయట నుంచి వచ్చే విజ్ఞానాన్ని మన కృషి అనుసంధాన కేంద్రాలో పరీక్షించి మన గ్రామాకనువైన విధంగా ఆ విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాన్నారు  దీనదయాళ్‌జీ. స్వాతంత్య్రం తరువాతనే ప్రభుత్వాలు, అర్థశాస్త్ర వేత్తలు, పంట గిట్టుబాటు ధర గురించి ఆలోచించడం మొదయింది. దిగుబడితో బాటుకు రైతుకు సరైన ధరభించేందుకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యా ము, రుణ వ్యవస్థ ఏర్పాటు చేయాని సూచించారు. ధన్య రక్షణ విషయమై గ్రామాలో చక్కటి గోదామును నిర్మించాని దానివల్ల ఉత్పాదకుడికి దాన్ని ఉపయోగించే వారికి మధ్య దూరం తగ్గిస్తే ధర నియంత్రణ కూడా సాధ్యమవుతుందన్నారాయన. వ్యవసాయంలోని సామాజిక కోణాన్ని కూడా ఆయన అధ్యయనం  చేశారు. వైశ్యులు వ్యాపారం తప్ప మరో పని చేయడం మానివేసిన తరువాతనే సమస్య ఉత్పన్నమైందని వ్యాపారస్థు సంఖ్య పెరిగిందని, కేవలం వినిమయంలోవున్న ధనం ప్రాధాన్యత పెరిగిందని, దీన్ని తగ్గించాని వ్యాపారులు కూడా ఉత్పాదకులు కావాని ఆయన సూచించారు. అయితే గ్రామ వికాసం కేవలం వ్యవసాయనికి పరిమితం కాకూడదని కుటీర పరిశ్రమను ప్రోత్సహించనంతవరకు అభివృద్ధి ఫలాను అందుకోలేమని దీనదయాళ్‌జీ అభిప్రాయపడ్డారు. దేశంలో స్థానిక సాధనాలు, స్థానికంగా వుండే నైపుణ్యం ఆధారంగా స్థానిక విపణిని ఉయోగించుకుంటే అధికార వికేంద్రీకరణ జరగినట్లేనని, ఇందుకోసం నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెట్టాని, పరిస్థితుకనుగుణంగా ప్రజ నైపుణ్యాన్ని తీర్చిదిద్దాని దీనదయాళ్‌ చెప్పారు. అభివృద్ధి ఒకే దిశలో జరిగితే మనం వైశ్వీకరణ చీకటిలో ఉండిపోతామని ఆయన హెచ్చరించారు.