ఆర్థిక దృక్పథం- హితవచనము


ధర్మార్దశ్చ కామశ్చ` అంటే నువ్వు ముందుగా దర్మాన్ని ఆచరిస్తే నీకు అర్థకామాలు  భిస్తాయి. యతోభ్యుదయ నిశ్రేయన్‌ స్థి: సధర్మ: (వైశేషిక దర్శనం)
వ్యక్తులు తమ కోరిక గుర్రాపై అదుపును కల్గి ఉండడంలో సహకరించేది ధర్మం (యమనియామా ద్వారా) భౌతిక సంపన్నతను కల్గియుండి కూడా దైవత్వం పట్ల అనుభూతిని పొందడానికి అవసరమైన అర్హతను ధర్మం కల్గిస్తుంది.
ధారణాత్‌ ధర్మమిత్యాహు: ధర్మోధారయతే ప్రజా:
వ్యక్తు సమిష్టి రూపం వల్ల ఉద్భవించిన శక్తి సమాజాన్ని కలిపి ఉంచుతుంది. దీనినే ధర్మం అంటారు. ధర్మం యొక్క నిర్వచనాను సరించి, ధర్మ సంస్థాపన అంటే సుసంఘటితమైన సమాజాన్ని నిర్మించడం దీనిలో ప్రతి వ్యక్తి ఇతర వ్యక్తుతో ఏకత్మతానుభూతిని పొందుతాడు, ఇతరు జీవితం సుఖమయంగా, సుసంపన్నంగా ఉండడానికి త్యాగా నికి సిద్ధమవుతాడు, ఆధ్మాత్మిక జీవనపు వికాసదిశలో పయనిస్తాడు, అంతిమ సత్యపు దిశలో ముందుకు వెళ్తాడు.
కోరికను తీర్చుకోవడంపై పరిమితులు లేకపోవడం, కోరిక సాధనకు పోటీ- వీటి వల్ల సుఖం భించదు. కనుక వ్యక్తిగతంగా, సమాజపరంగా సంయమనాన్ని నిర్మించాలి. ఈ సంయమనంతో గూడిన జీవనాన్ని చతుర్విధ పురుషార్ధాలు కల్గిస్తాయి. ధర్మం ఆధారంగా వ్యక్తి సమాజంలో నియంత్రింపబడాలి. ధర్మ నియంత్రణలోనే అర్థకామాలు ఆరాధింపబడాలి. వస్తువినియోగం, అధికారము ధనము, ఇవన్నింటినీ ధర్మం నియంత్రించాలి. వీటన్నింటి అంతిమ క్ష్యం మోక్ష సాధన.

పరమ పూజనీయ శ్రీ గురూజీ