పతాక శీర్షికల్లో కాశ్మీర్‌

కాశ్మీర్‌ అనేక రోజులుగా పతాక శీర్షికలో కనబడుతున్నది. జులై 8వ తేది నుంచి కాశ్మీర్‌లో నిరంతర ఘర్షణలు కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ కూడా విధించడమైనది. ఈ మధ్యనే కర్వ్యూ ఎత్తివేయటం జరిగింది. దీంతో కాశ్మీర్‌ సమస్య మరోసారి పతాక శీర్షికలోకి ఎక్కింది. కాశ్మీర్‌లో జరుగుతున్న గొడవపైన పాకిస్తాన్‌ ప్రభుత్వం అధికార పూర్వకంగా ఒక ప్రకటన విడుద చేసింది. బుర్హన్‌ వనీ ఒక సమరయోధునిగా చిత్రీకరిస్తూ కాశ్మీర్‌ ప్రజను భారత్‌ అణిచివేస్తోందని ప్రచారం చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి ఆగష్టు 15న ఎర్రకోటపై నుంచి మాట్లాడుతూ స్వతంత్య్రం కోస పోరాటం చేస్తున్న బెలుచిస్తాన్‌ ప్రజపై పాకిస్తాన్‌ చేస్తున్న దాడిని ఖండిస్తూ ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అదే విధంగా పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌లోని ప్రజలు తమపై పాకిస్తాన్‌ ప్రభుత్వం చేస్తున్న దారుణ మారణకాండకు నిరసనగా ఉద్యమాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని కూడా ప్రపంచ దృష్టికి తీసుకువెళ్తానని నరేంద్రమోడీ చెప్పారు. ఈ పరిస్థితును గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కాశ్మీర్‌ సమస్య గురించి ప్రపంచానికి తెలియజేయడానికి 22మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్ని దేశాకు పంపించే ప్రయత్నాలు  ప్రారంభించారు. మొత్తం మీద పాకిస్తాన్‌ తనను తాను కాశ్మీర్‌ విషయంలో చేస్తున్న ప్రకటనను సమర్థించుకోవటానికి నానా తంటాలు పడుతున్నది. అత్యంత కీకమైన గిల్గిత్‌ బల్టిస్తాన్‌ ప్రాంతం బ్రిటీష్‌ పానలో ఉన్నప్పుడు అక్కడ ఒక సైనిక కంటోన్మెంట్‌ ఉండేది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బ్రిటీష్‌ వాళ్లు మన నాయకుకు గల్గిత్‌బల్టిస్తాన్‌లో ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాని సూచించారు. ఆ విషయాను అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ పట్టించుకోలేదు. ఎవ్వరి ఆధీనంలో లేని గిల్గిత్‌ బల్టిస్తాన్‌ను పాకిస్తాన్‌ ఆక్రమించుకున్నది. ఇదంతా ఒకప్పుడు కాశ్మీర్‌ రాజ్యానికి సంబంధించిన భూభాగం. కాశ్మీర్‌ సమస్య పరిష్కరించుకోవటానికి ఒక సమగ్రమైనటువంటి విధి విధానాను మన ప్రభుత్వం తయారుచేసుకొని ఆ సమస్య పరిష్కారానికి కృషిచేయాలి. కాశ్మీర్‌లో ఇప్పుడు జరుగుతన్న గొడవను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం విశేషమైన ప్రయత్నం ప్రారంభించింది. ఆ ప్రయత్నం సఫలం కావాని అందరం కోరుకుందాం.