బృందావనంలో ధార్మిక విప్లవం

ఇదంతా ఊహాతీతంగా ఉన్నది. నమ్మశక్యముగా లేదు నాకు చాలా సంతోషంగా ఉన్నది- అన్నది ఉషా చమూర్‌. ఈమె రాజస్థాన్‌లో అల్వార్‌నుండి వచ్చిన ఒక పారిశుద్ధ్య కార్మికురాలు. నిన్న మొన్నటివరకు అస్పృస్యురాలిగా అవమానాలు ఎదుర్కొన్న ఈ మహిళ బృందావనంలో జరిగిన కార్యక్రమాలు చూచి ముగ్ధురాలైంది. ఒక స్వచ్ఛంద సేవాసంస్థ చొరవతో బృందావనంలో నివసించే 200 మంది పారిశుద్ధ్య కార్మికులు 50 మంది పురోహితుకు సంస్కృత పండితుకూ రక్షాబంధన్‌ కట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమం ప్రాచీన గోపీనాథ్‌ ఆయంలో జరిగింది. ఇదే ఆయంలో 400 సంవత్సరా ఆంక్షను తుత్తునియులు చేస్తూ బృందావనంలో నివసించే వితంతువులు రంగు పండుగ హోళీ జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలో పాల్గొన్న ఒక పారిశుద్ధకార్మికురాలు రేష్మాసర్‌సోర్‌ ఆనందంతో ఇలా అన్నది. ఇప్పుడు నేను కూడా ఒక మనిషిలాగా గౌరవం పొందుతున్నాను. అంటరానితనం నిర్మూలించ బడుతున్నది` ఈ అమ్మాయి ఇప్పుడు ఊరగాయలు, అప్పడాలు చేసి అమ్ముతున్నది. శ్రీమద్భాగవత విద్యాయం అధిపతి శ్రీరామానుజం పత్రిక వారితో మాట్లాడుతూ బృందావనంలో కులాలు సమసిపోతున్నాయి, అంటరానితనం అంతరిస్తున్నది అన్నారు.