హిందూ రాష్ట్రం అంటే భారతదేశములోని జీవన విధానమే - ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌, డా॥ మన్మోహన్‌ వైద్య

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అఖిభారత ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌వైద్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో దేశంలో లౌకికవాదం, అల్పాసంఖ్యాకులు సమాజంలో ఉన్న వివిధ సమస్య పట్ల సంఘ్‌ యొక్క అభిప్రాయాను ఇంటర్వ్యూలో తెలియజేశారు. దేశంలో సంఘ పేరుతో పనిచేస్తున్న వివిధ సంస్థలు వాటి కార్యకలాపాలు చూసి సంఘాన్ని అంచనా వేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దాని ద్వారా వాళ్లకు సంఘం సరిగ్గా అర్థం కాకపోగా అపోహలు కూడా కనబడుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రభావం ఈ రోజున సమాజంపైన చాలా ఉంది. సంఘం సమగ్ర సమాజానికి సంబంధించిన విషయాను దృష్టిలో ఉంచుకొని పనిచేసే సంస్థ. ఈ విషయాను వారు తమ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విషయాను గమనిద్దాం...
లౌకికవాదం అనే పదాన్ని వాడడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు సంశయిస్తున్నది? వాటి కారణాలు ఏంటి?
మన దేశంలో అత్యధికంగా దుర్వినియోగమవుతున్న పదాలో లౌకకివాదం ఒకటి. ఈ లౌకికవాదం మైనార్టీపట్ల అధిక ప్రేమను చూపించడానికే వినియోగిస్తున్నారని అర్థమవుతున్నది. రాజ్యాంగాన్ని తయారు చేసేప్పుడు ఈ లౌకికవాదం గురించి ఉపోద్ఘాతంలో చర్చించబడిది. లౌకికవాదాన్ని రాజ్యాంగంలో చేర్చాలా?వద్దా? అనే విషయంపై కూడా చర్చ జరిగింది. డా అంబేద్కర్‌లాంటి పెద్దలు మన రాజ్యాంగంలో ఈ లౌకికవాదం అనే పదం చేర్చడం అవసరం లేదు. ఈ దేశమే సర్వపంత సమభావన కలిగిన దేశం. దానిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మన రాజ్యాంగం మొదటినుండే అన్ని మతాకు సమానమైన హక్కును కల్పించింది, అందులో భాగంగా అల్పసంఖ్యాక మతస్థులు కూడా తమ మత విశ్వాసాను ఆచరించడానికి, బోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశాను కల్పించింది. అయినప్పటికీ 1976లో అత్యవసర పరిస్థితి కాలంలో ఎవరూ కోరకపోయినా లౌకికవాదం, సామ్యవాదం అనే పదాను ఇందిరాగాంధి రాజ్యాంగంలో ప్రవేశపెట్టింది. అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం దేశంలోని ప్రతిపక్ష నాయకులందరనీ  జైళ్లలో తోసింది. 
అన్ని మతాను సమానంగా గౌరవించే భారతదేశంలో లౌకికవాదం అనే పదం అనవసరం. ఈ లౌకికవాదం పుట్టుక యూరప్‌లోని రాజ్యవ్యవస్థకు మరియు మతానికి మధ్య వచ్చిన సంఘర్షణ కారణంగా ఉద్భవించింది. వే సంలుగా ఇక్కడ అన్ని మతాను సమానంగా ఆదరించడం జరిగుతోంది.  పార్శీ, యూదు, సిరియన్‌ క్రిష్టియన్లు వేరే దేశా నుండి భారతదేశంలోకి వచ్చి వివిధ ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు. వారు ఈ దేశాన్ని తమ మాతృ భూమిగా భావిస్తూ తమ మతాను స్వేచ్ఛగా, ఎలాంటి భేదభావాలు, హింసకు తావు లేకుండా ఆచరిస్తున్నారు.  
1893వ సంలో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనం సమావేశంలో స్వామి వివేకానంద మాట్లాడుతూ భారతదేశంలో భగవంతుడు ఒక్కడే అతన్ని చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయనే సత్యాన్ని అంగకీరిస్తాము. అందుకే ఈ దేశంలో సహనాభావం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యమే హిందుత్వం యొక్క విశిష్టత.
లౌకిక వాదం అనే పదం రాజ్యాంగంలో ఉండటం వన కలిగే నష్టమేమిటి?
లౌకికవాదం అనే పదానికి నిఘంటువులో ఉన్న అర్థం ప్రకారం ఆలోచిస్తే ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు. కానీ దురుద్దేశ పూర్వకంగా ఆ పదాన్ని హిందుత్వం, దేశం వ్యతిరేక పదాకు సమాన అర్థంగా ఉపయోగించే సంస్కృతిగా ఈ రోజున మారిపోయింది. ఆచరణలో మాత్రం దీన్ని ఒక మతతత్వ ఎజండాను ముందుకు తీసుకోనిపోవడానికి అన్ని మత సముదాయాకన్నా ఒక మతానికి మాత్రమే అనుకూలంగా ఉండడం జరుగుతోంది.
జాతీయ వనరుపై మొట్ట మొదటి హక్కు ముస్లింకు ఉన్నది`అని మన్మోహన్‌ సింగ్‌ చెప్పడం లౌకికవాద ప్రకటననా? ప్రభుత్వాలు హజ్‌ లేదా ఎలాంటి మతపరమయిన తీర్థ యాత్రకు నిధులు ఎందుకు కేటాయించాలి? ముస్లిం దేశాలు కూడా హజ్‌ కోసము ఎలాంటి నిధులు సమకూర్చవు. తమ సొంత సంపాదనతో చేస్తేనే హజ్‌ యొక్క ఫలితముంటుందని చెప్పగా నేను విన్నాను. మందిరా విషయాలో ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిశీన చేస్తుంది కానీ అల్పసంఖ్యాకు ప్రార్థనాస్థము విషయములో మాత్రం కలుగజేసుకోదు.  అసదుద్దీన్‌ ఒవైసీ లాంటివారు మతతత్వ వాదులు కారు అని త్యంత లౌకికవాది అని చెప్పుకుంటూ ఉంటారు.
అల్ప సంఖ్యాకులవాదము అనేది వేర్పాటు వాదాన్ని పోషిస్తూ, దేశ గొప్పతనాన్ని, పురాతనమైన మన ఐక్యతకు హాని కలిగిస్తుంది. లౌకిక వాదం అనే ఆలోచనను లౌకిక రాజకీయ పార్టీని చెప్పుకొనే వాళ్ళే తమ స్వార్థం కొరకు దుర్వినియోగపరిచారు. అంతేకాక, లౌకికవాదము దాని దురుపయోగంపై  చర్చ చేపట్టినంత మాత్రాన్నే వారిని లౌకికవాదానికి  వ్యతిరేకునీ, మతతత్వ రాజ్యస్థాపనకు అనుకూలురు అని చిత్రీకరిస్తారు. ఇది పచ్చి అబద్ధము మరియు నిజాను తప్పుదారి పట్టించడమే.
అల్ప సంఖ్యాకు హక్కు గురించి  ఆర్‌ఎస్‌ఎస్‌ ఒప్పుకొన్నట్టు కనపడదు ఎందుకు?
భారతీయు ఆలోచన ప్రకారం అన్ని మతాలు ఒకే గమ్యము చేరుకుంటాయని భావిస్తుంది. వాటిని పాటించే వారందరూ సమానమే అని విశ్వసిస్తుంది, కాబట్టి అందరిని సమదృష్టితో చూస్తుంది. భారతదేశంలోని 99శాతం ముస్లిమ్స్‌ మరియు క్రైస్తవు పుట్టుక రీత్యా ఇక్కడి వారే కాని మతం మారినారు. కేవలం మత విశ్వాసాను మార్చుకున్నంత మాత్రానవారు  అల్ప సంఖ్యాకులుగా ఎట్లా అవుతారు?
భారతదేశంలో పార్శీ, యూదులు నిజమైన  అల్ప సంఖ్యాకులు. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రాంతం నుండి తమ మత ఆచారాతో పాటు ఇక్కడికి వస వచ్చారు. కాని వారు అల్ప సంఖ్యాకులుగా గుర్తించబడడానికి నిరాకరించారు, అట్లే తమకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని కూడా కోరలేదు. అల్పసంఖ్యాకు అవసరా గురుంచి మాట్లాడడం అంటే అది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే.
చట్టం దృష్టిలో అందరూ సమానమే అయితే మైనారిటీ కమిషన్‌ ఎందుకు? ఒకే మానవ హక్కు కమీషన్‌ ద్వార ఎలాంటి అన్యాయాన్ని అయిన పరిష్కరించవచ్చు.
మత కహా దృశ్యా, అంటే 2002 అల్లర్లు, సచార్‌ కమటీ రిపోర్టు ద్వార అల్ప సంఖ్యాకు హక్కు సంరక్షణ అని వాదించవచ్చు కదా?
2002 సంలో జరిగిన మత కహాలు మైనార్టీ విషయంలో సచార్‌ కమిటీ రూపొందిం చిన రిపోర్ట్‌ ద్వారా దేశంలో అల్పాసంఖ్యాకు హక్కు సంరక్షణ చేయాలి అని వాదించవచ్చు. సచార్‌ కమిటీ రిపోర్ట్‌ ప్రకారం ముస్లిమ్స్‌ ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉండడానికి కారణం వారు ఆర్థికంగా వెనుకబడిన బీహార్‌, బెంగాల్‌ మరియు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలో నివసించటం. ఈ రాష్ట్రాలో స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఎక్కువ కాలం లౌకికవాదుము అని చెప్పుకొనే పార్టీలే అధికారంలో ఉన్నాయి. అదే కమిటీ నివేదిక ప్రకారము గుజరాత్‌లో నివసిస్తున్న ముస్లిం ఆర్థిక పరిస్థితి పశ్చిమ బెంగాలులోని ముస్లిముకన్నా ఎంతో మెరుగ్గా వుంది.  
 మత కహా అంశానికి వస్తే అవి 2002 ముందు కూడా జరిగాయి. భాగాల్పూర్‌, మలియానా (మీరట్‌) కోఖ్రాజార్‌ను మనము మర్చిపోకూడదు. ఆ గొడవలు జరిగిన సమయాలో అక్కడ  అధికారంలో ఎవరున్నారు?
అధికారములో ఉన్న పార్టీని నిందించే బదులు అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతాయో తెలుసుకోవడము చాలా ముఖ్యం. ఒకవేళ మనం మతపరంగా సున్నితమైన ప్రాంతాలు కలిగిన నగరాను పరిశీలిస్తే అవి ప్రముఖంగా ముస్లింలు అధిక సంఖ్యలోనున్న ప్రదేశాలు అని గుర్తించవచ్చు.
హిందూవులు అధిక సంఖ్యలోనున్న ప్రాంతాలో మత కహాలు ఎందుకు జరుగవు? నేను పుట్టి పెరిగిన నాగపూరులో మత కహాలు జరగడము నేను ఎప్పుడూ చూడలేదు, కానీ 1983లో నేను గుజరాత్‌ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని  సున్నితమైన ప్రదేశాలో హిందూ పండుగలు జరిగే సమయలో మతకహాలు జరగడం గమనించాను.  గొడవలు జరగడము మంచిది కాదు అవి జరగకుండా నిరోధించాలి కానీ కేవం 2002 అల్లర్ల గురించే మాట్లాడడమే తప్పు.
వ్‌ జిహాద్‌, గోవధ ఆరోపణ ఆధారంగా మత హింస అధికమవుతుంది. దీన్ని మీరు ఎట్లా వివరిస్తారు?
ఇవి వేరు వేరు అంశాలు. వ్‌ జిహాద్‌ అనే పదం సంఘ్‌ సృష్టించింది కాదు. మొదటిసారిగా ఆ పదాన్ని జస్టిస్‌ కే.టీ. శంకరన్‌  కేరళ హైకోర్టు తీర్పులో ప్రస్తావించారు. వారు గమనించిన విషయం - కొంతమంది తమ అసలు గుర్తింపును దాచిపెడుతూ ఒకే తరహాలో మిగితావారితో సంబంధ బాంధవ్యాను ఏర్పరుచుకోవడం. నిజమైన మతాంతర వివాహాకు మేము వ్యతిరేకం కాదు, కాని ఇవి ఒక పధకంలో భాగం అయినపుడు ప్రమాదం, వాటి గురించి చర్చ జరగాలి మరియు దాన్ని తిప్పికొట్టాలి.
గోవధ అనేది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు, ఇది ఆర్థిక సంబధమైనది. మనం వ్యవసాయ ఆధారిత సమాజంగా ఎదుగుతున్న కొద్ది గోవు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. విపరితీమైన రసాయనిక ఎరువు వాడకము వన దాని ప్రభావం భూమిపైన తదనుగుణంగా మనం తినే ఆహారంపైన కూడా పడుతుంది. సేంద్రీయ వ్యవసాయము యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. సేంద్రియ వ్యవసాయానికి భారతీయ జాతి ఆవు కీకం. ఔషధ గుణాలు కలిగిన గోఆధారిత ఉత్పత్తులు కేవలం శాకాహారుకు మాత్రమే కాకుండా అందరికీ (అన్ని మతస్తు) మేలు చేస్తాయి.
గోసంరక్షణ గురుంచి గాంధీ నుండి బహదూర్‌ షా జఫర్‌ వరకు అందరు మాట్లాడారు. గోవధ  జమ్మూకాశ్మీరులో (ముస్లిమ్స్‌ అధికంగా ఉన్న రాష్ట్రం)  ముందుగానే నిషేధించబడినది. మన సమాజం, ఆర్థిక వ్యవస్థలో ఉన్న గోవు ప్రాముఖ్యత పైన ఉన్న సంబాషణను దాద్రీఊనాలో జరిగిన సంఘటన నుండి వేరుచేయడం సాధ్యం కాదు.

మొత్తంమీద మేము హింసకు వ్యతిరేకం. దానికి సంబధించిన చట్టాను అమలు చేయాలి. దాద్రీ మరియు ఊనా సంఘటనపైన చాలా అసత్యాలు ప్రచారం చేయబడ్డవి. ప్రస్తుతం దాద్రీ విషయంలో నిజాలు బయటికి వస్తున్నాయి. ఊనా విషయానికి వస్తే అది ఒక నాటకీయకంగా చేయబడిది అనే సూచనలు వెలువడుతున్నాయి.