దేశద్రోహుల ఆటకట్టు - జాతికి అంకితమైన అణుకేంద్రం

కాదేదీ కవితకనర్హం అన్నాడొక కవి. ఏమిచేసి అయినా, దేశాభివృద్ధి అడ్డుకోవాని చూస్తారు కొంతమంది దేశద్రోహులు. ఎన్‌జివో పేరుతో కొంతమంది ఏదో ఒక ఉద్యమం చేస్తూ ఉంటారు. అంటువంటిదే తమిళనాడులో కూడంకుళం ఉద్యమం ఇటువంటి ఉద్యమా క్ష్యం ఒక్కటే! భారత దేశం బపడరాదు. ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభంలో ఇరుక్కుని ఉండాలి అనేదే వీరి ధ్యేయం. 1988లో రష్యాతో జరిగిన ఒప్పందం ఆధారంగా కూడంకుళంలో ఒక  అణు విద్యుత్‌ కేంద్రానికి అంకురార్పణ చేశారు. కాని ఇది క్రైస్తవ మిషనరీకు నచ్చలేదు, వారు ఒక పరిసర వాతావరణ రక్షణ - ఎన్‌జీవో ముసుగులో అణువిద్యుత్‌ కేంద్రానికి పూర్తిగా అవరోధాలు కల్పించారు. సుభ్రమణ్యం-ఉదయ్‌కుమార్‌ అనే ఇద్దరు శిఖండును అడ్డుపెట్టుకుని ఒక పెద్ద ఉద్యమం నడిపారు. ఈ అణుకేంద్రం వస్తే కాలుష్యం పెరుగుతుంది అన్నారు. చుట్టుప్రక్క ప్రజకు ప్రాణాపాయం అని ఊదరగొట్టారు. ప్లాంటు నిర్మాణానికి సంబంధించిన ఏ కార్యక్రమం మొదలైనా, ప్రక్కనే ఉన్న సెయింట్‌ లూథరన్‌ చర్చిలో గంటను మ్రోగించే వారు, వెంటనే వేలాదిగా క్రైస్తవులు వొచ్చి ప్లాంటు పనును అడ్డుకునేవారు. 6000 మందిపై దేశద్రోహం కేసు రిజిస్టర్‌ అయినవి. 8000 క్రిమినల్‌ కేసులు కూడా పెట్టబడినవి. ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించడం వల్ల ఉద్యమం నీరుకారింది. కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్ర మొదటి దశను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 10-08-2016 నాడు జాతికి అంకితం చేశారు. ఇంకా 5 యూనిట్లు కూడా నిర్మిస్తాం అని మోడీ తెలిపారు. భారత్‌ మాతాకీ జై.