సౌభ్రాతృత్వము పాడుచేస్తున్న శక్తుల పట్ల జాగరూకులై వుండాలి


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి గారి పత్రికా ప్రకటన

ఈ మధ్య దేశంలో చోటుచేసుకొన్న కొన్ని దురదృష్ట సంఘటన పట్ల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తీవ్రవిచారాన్ని వ్యక్తం చేసింది. దేశంలో కొన్ని చోట్ల షెడ్యూలు కులాకు చెందినవారిపై జరిగిన దాడులను అమానుష సంఘటనలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సర్‌ కార్యవాహ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. సమాజంలో కొన్ని శక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చేస్తున్న ఈ దాడును తీవ్రంగా అందరం ఖండించాలి. ప్రచార మాధ్యమాలు ఇటువంటి సంఘటనను పూర్తి అధ్యయనం చేయకుండా చేస్తున్న ప్రచారం కారణంగా సమాజంలో పరస్పర అవిశ్వాసం, వైషమ్యాలు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాకోసం వైషమ్యాలు పెంచిపోషిస్తున్నారు. దానితో దేశంలో ప్రజ సమరసతా వాతావరణము దెబ్బతింటున్నది. ఈ పరిస్థితును చక్కదిద్దటానికి దేశంలోని కు సంఘా పెద్దలు, సామాజిక నాయకులు ప్రజలందరిని కలుపుకొని వారి సహకా రంతో పరిస్థితును చక్కదిద్ది అమానుష దాడులు తిరిగి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలందరి పట్ల సహోదర భావం నిర్మాణం చేయాలి. చట్టాన్ని తమ చేతులోకి తీసుకొని దాడుకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం చట్టరీత్యా శిక్షించి చర్యలు తీసుకోవాలి. సమాజం సహోదర భావం జాగృతం చేయాలి.