జ్ఞానజ్యోతుల మనోరవళి దీపావళి

చెడుపై మంచి విజయమే దీపావళి...ఇది కేవలం ఓ పండుగ మాత్రమే కాదు. ఓ ధీర వనిత విజయ గాథ. వరగర్వంతో పరాయి స్త్రీలను చెరబట్టి... చివరికి మరో స్త్రీ చేతిలోనే మత్యువుకు చేరువైన రాక్షసుడి గాథ. విష్ణుమూర్తి, భూదేవిలకు జన్మించి అదే భూదేవి అంశగా పుట్టిన సత్యభామ చేతిలో అంతమొందిన నరకాసురుడి కథ. పదునాలుగు వేల మంది అబలలకు విముక్తి కల్పించి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన సత్యభామదేవి మహిళలకు ఆదర్శం. అందుకు ఆమె వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోడమనేది ఎంతో అవసరం.

నరకాసుర సంహారం జరిగిందిలా.. 

కనిపించిన ప్రతి మహిళను చెరబట్టడం అతనినైజం. విష్ణుమూర్తి, భూదేవిల కుమారుడైన నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణం పొందేలా వరం పొందుతాడు. ఆ వర గర్వంతో విర్రవీగు తాడు, తనకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో లోకాలన్నింటినీ ఆక్రమించుకుంటాడు. ఆ సందర్భం లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకోసం శ్రీకష్ణ పరమాత్మ డు సత్యభామా సమేతుడై నరకాసురుని మీదకు యుద్ధానికి దండెత్తుతాడు. మొదట మురరాక్షసుని, తదుపరి అతని కుమారులను సత్యభామా కష్ణులు అంతమొందిస్తారు. ఇది తెలిసి ఆగ్రహాన్ని పట్టలేని నరకాసురుడు స్వయంగా తన బలగాలతో రంగంలో కి దిగుతాడు. శ్రీ కృష్ణుడు నరకాసురుల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. నరకాసురుని వరం గురించి తెలిసిన నల్లనయ్య అతడి బాణానికి మూర్ఛపోతాడు. అది చూసిన సత్యభామ తన సుకుమారాన్ని వదిలి రౌద్రాన్ని తనయందు ఆవహిం చుకుంటుంది. కన్నుల నిండ నిప్పుకణికలు ఉన్నాయా అనేంతలా ఆగ్రహాన్ని వెలువరిస్తుంది.. ఆ మహావిష్ణువునే తన రథసారథి గా చేసుకుని నరకాసు ర వధకు బయలుదేరుతుంది.నరకాసురునితో భూమి, ఆకాశాలు కంపిస్తున్నాయా అనేంతలా పోరాడుతుం ది. ఇలా తీవ్ర పోరాటం అనంతరం బహుళ చతుర్థశి నాడు సత్యభామా కృష్ణులు కామరూపాధిప తిని నామరూపాలు లేకుండా అంతమొందించారు.

శక్తికి మారుపేరే మగువ 

దాంపత్యంలోని అన్యోన్యత, సఖ్యత, ఆత్యీయత ఎంతటివో, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయగలిగే ప్రేమ ఎంతటిదో ఈ కథద్వారా మనం తెలుసుకో వచ్చు. ఎప్పడూ చెల్లికత్తెలతో అంతపురంలో సుకుమారంగా ఉండే సత్యభామ యుద్ధభూమిలో విరోచిత పోరాటం చేయడమనేది ఎవరికైనా ఆశ్యర్యాన్ని కలిగించే విషయమే. రాజభోగాలను అనుభవిస్తూ, సేవికల సపర్యలు అందుకుంటూ, వెన్నదొంగతో వెటకారం చేస్తూ సుఖంగా జీవించే ఆ అబల ఆయుధం పట్టిందంటే ఎంతటి కష్టం తనకు వచ్చి ఉండాలి. క్షత్రియురాలిగా రాజ్యానికి కష్టం వచ్చినప్పడు రాటుదేలిన తాను, భర్తకు బలం చేకూర్చడానికి చేదోడుగా మారింది. అలిసి తనకు బాసటగా నిలిచిన శ్రీకష్ణుని సాయంతో వీరఖడ్గ రూపిణియై తన బిడ్డయైన నరకాసురుని వధించింది. ఒక తల్లి తన బిడ్డను వధిస్తుందా? కానీ ఆమె ధరణీ దేవి. ఒక బిడ్డవల్ల తన ఇతర బిడ్డలకు కష్టం వస్తుందంటే ఏతల్లి సహించ గలదు. అందుకే లోకహితం కోసం ఆ ధరణిధరుని మాట జవదా టక, సర్వలోకాలను రక్షించేందుకు తన బాధ్యతగా నరకాసురుని సత్యభామ సంహరిం చింది. దీని ద్వరా ఒక స్త్రీ తన బాధ్యతలను ఎప్పటికి మరువదని, ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక ఆలిగా తన బాధ్యతల ను సర్వత్రా ఆచరిస్తుందనే విషయం తెలుస్తుంది. అత్యాచారాలను, దురాచారాలను, అణచివేతలను ఎదుర్కొనడంలో సత్యభామ చూపిన తెగువ ఎంతో గర్వకారణం.

ధీర వనిత స్పూర్తితో

సత్యభామను నేటి యువతులు, మహిళలు సూార్తిేగా తీసుకోవాలి. తమలోని పోరాట పటిమను వెలికి తీయాలి. వీధికి ఒక నరకాసురుడు తయారువు తున్న ఈ తరుణంలో ఆయుధం చేతబట్టగలిగే మానసిక స్థితికి చేరుకోవాలి. సత్యభామలాగా సౌమ్యాన్ని ప్రదర్శిస్తునే అవసరానికి అనుగుణంగా రౌద్రాన్ని వ్యక్త పరచాలి.. ఆత్మరక్షణ విద్యలను అవపోసన పట్టాలి. క్షత్రియ ధర్మాన్ని కూడా అవలంబించాలి. క్షత్రియ ధర్మమనేది కేవలం స్వరక్షకే కాకుండా లోకహితం కోసం కూడా చేపట్టే తెగువ నేటి స్త్రీలలో పెంపొందాలి. ఒక తల్లిగా తన బిడ్డ చెడ్డవాడైతే, సమాజానికి చేటు చేసే వాడైతే, స్త్రీలకు కంటకంగా మారితే వాడిని అవసరమైతే మందలించాలి.. అంతకు వినకుంటే అంతు చూసేంత కాఠిన్యం మదిలో పెంపొందాలి. సత్యభామ నరకాసుర వధలో అదే కాఠిన్యాన్ని ప్రదర్శించిం ది. ఒక భర్తకు భార్య, భార్యకు భర్త తోడు ఎంత అవసరమో అనే విషయం, తన భర్త పట్ల సత్యభామ ప్రదర్శించిన ప్రేమ, అనురాగం, వాత్య ల్యం, ఎనలేని నమ్మకాలు ఇవన్నీ దంపతుల మధ్యు ఉండవలసిన దాంపత్య బంధాన్ని నరకాసుర వధ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే తాను స్త్రీ అయినప్పటీకి సత్యభామ తనను తాను ఎప్పడు సబలగానే భావించింది. అదే విధంగా నేడు సమాజంలో పెరు గుతున్న అత్యాచారాలు, అన్యాయాలు, అణచివే తలకు వ్యతిరేకంగా ప్రతి మహిళ ఒక సత్యభామ రూపంగా మారాలి. కదన రంగంలోకి దిగి సమాజ హితం కోసం పోరాడాలి. కామరూపులను, దేశ ద్రోహులను వెంటాడి, వేటాడే ధీశాలురుగా వారు మారాలి. సౌమ్యతే కాదు సందర్భాన్ని బట్టి సాయుధులుగా మారి ధర్మ, దేశ రక్షణలకు ముందుకు రావాలి. ఇది జరిగనప్పుడే సమాజంలో స్త్రీలకు సమానత్వం వస్తుంది. నారిని దేవతగా పూజించే ఈ పుణ్యభూ మిలో స్త్రీ తిరిగి తన శక్తి స్వరూపాన్ని పొందగలు గుతుంది. ముష్కర మూకల అంతు చూడగలుగుతుంది. మానవత్వాన్ని మరచి మహిళలను ఆట వస్తువులుగా మార్చిన దుష్ట శక్తులకు సింహస్వప్నం గా మారుతుంది. దేశ, ధర్మ, సమాజ హితానికి మహిళ ఒక మహోన్నత ఆయుధం కావడానికి సత్యభామను స్ఫూర్తిగా తీసుకుంటుందని, భారతావనిని విశ్వగురువుగా నిలపడానికి ఒక మహాశక్తిగా స్త్రీ శక్తి మారుతుందని ఆశిద్దాం. ఈ దీపావళిని దివ్వెల పండుగగానే కాదు.. దేశరక్షణకు దండుగా నిలిచే మహిళావళిగా జరుపుకుందాం.