కేరళలో అడ్డులేని కమ్యూనిస్టుల హింస - ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి తీర్మానం-1కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌., ఇతర హిందూ సంస్థలపై సిపిఐ(యం) హింసను కొనసాగిస్తూ ఉండడాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో తీవ్రంగా ఖండించింది. 1942లో కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తన కార్యక్రమాలను ప్రారంభించినప్పటి నుండి రాష్ట్ర ప్రజలలో దేశభక్తి భావాలు, ఐక్యత, సమైక్యతా స్ఫూర్తిని కలిగిస్తూ ప్రజలలో తన పలుకుబడిని, ప్రభావాన్ని పెంచుకొంటూ ఉండటంతో వామపక్షాలు, అందులో ముఖ్యంగా సిపిఐ(యం) సహించలేక సంఘ శాఖలు, కార్యకర్తలపై ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా ఉద్దేశ్య పూర్వకంగా దాడులు చేస్తూ ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మార్క్సిజమ్‌ ఒక సిద్ధాంతంగా స్వభావరీత్యా అసహనంతో కూడుకున్నదే కాకుండా, నిరంకుశమైనది కూడా.

గత ఏడు దశాబ్దాలుగా తమ నాయకత్వపు ఆమోదంతో రాష్ట్రవ్యాప్తంగా రక్తపిపాసి అయిన సిపిఐ(యం) కార్యకర్తలు 250 మందికి పైగా మంచి భవిష్యత్‌ గల యువకులైన సంఘ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. ఇంకా అనేకమంది మహిళలు, పురుషులను తీవ్రంగా గాయపరచి అంగవికలురుగా చేశారు. వీరిలో అత్యధికులు సిపిఐ(యం) కోటగా భావించే కన్నూర్‌ జిల్లాకు చెందినవారు. చాలామంది తమ కార్యకర్తలు జాతీయవాద చింతన, సచ్చరిత్ర గలిగిన వ్యక్తిత్వాలు, కేవలం ప్రేమ, ఆత్మీయతల ఆధారంగా పనిచేస్తున్న సంఘ్‌లోకి వరదలా వస్తూండడంతో సహించలేక సిపిఐ(యం) విసుగుతో ఇటువంటి దారుణానికి పాల్పడుతున్నది.

''అందరితో స్నేహం, ఎవ్వరి పైనా ద్వేషం లేకపోవడం'' అనే విధానంతో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహం, సమగ్రత, సమైక్యత సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండడంతో సహించలేక పోతున్నారు. విభేధాలకు అతీతంగా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పాటుకు సంఘ్‌ నిజాయతీతో ప్రయత్నాలు చేస్తున్నది. అయితే దురద ష్టవశాత్తు సిపిఐ(యం) వివేకం కోల్పోయి దారుణమైన చర్యలకు, అర్ధంలేని హింసకు పాల్పడుతున్నది.

ఈ మధ్యనే జులై 11న బియంయస్‌ కార్యకర్త సి.కె.రామచంద్రన్‌ను ఆయన ఇంటివద్దనే భార్య ముందు ఆమె ఎంతగా ప్రాధేయపడుతున్నా వినకుండా అమానుషంగా హత్య చేశారు. గర్భంతో ఉన్న తన సోదరికి మందులు తేవడం కోసం వెడుతున్న కె.రామిత్‌ను పట్టపగలు అక్టోబర్‌ 12, 2016న అతని ఇంటిముందే చంపివేశారు. బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న అతని తండ్రి ఉత్తమన్‌ ను కూడా విధినిర్వహణలో ఉండగా బస్సు లోనే సిపిఐ(యం) గూండాలు 14 ఏళ్ళ క్రితం హత్య చేశారు. ఇప్పుడు ఆ కుటుంబంలో రామిత్‌ ఒక్కరే కుటుంబ పోషణ బాధ్యతను నిర్వహిస్తున్న వ్యక్తి. సిపిఐ(యం) హింసకు, అమానుష అసహనానికి ఇవి తాజా ఉదాహరణలు మాత్రమే.

సిపిఐ(యం) ఇటువంటి హింసాయుత చర్యలను కేవలం వివిధ క్షేత్రాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంఘ కార్యకర్తలపైననే కా కేరళలో తన మాతక సంస్థ సిపిఐ, ప్రస్తుత భాగస్వామ్య పక్షాలైన ఆర్‌.యస్‌.పి., జనతాదళ్‌ వంటి పార్టీల కార్యకర్తలపైన సహితం ప్రదర్శిస్తున్నారు.

పార్టీని వదిలి వెడుతున్న తమ సొంత కార్యకర్తలను సహితం విడిచిపెట్టడం లేదు. 2012 మే 4న టి.పి.చంద్రశేఖరన్‌ను దారుణంగా హత్య చేయడం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సిపిఐ(యం) హింసాయుత చర్యలకు బాధితులు తమను తాము రక్షకులంగా చెప్పుకొంటున్న పేద, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. వారు మహిళలు, బాలలను సహితం వదిలిపెట్టడం లేదు.

సిపిఐ(యం) ఆధ్వర్యంలోని ఎల్‌.డి.యఫ్‌. కేరళలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా హోం మంత్రిత్వ శాఖను ఆ పార్టీకి చెందిన వారే ఉంచుకొంటూ పోలీసులను తమ అదుపులో ఉంచుకొని పార్టీ కార్యకర్తలకు సంఘ్‌ శాఖలపై, కార్యకర్తలపై హింసాయుత దాడులు జరపడానికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నారు. కేవలం సంఘ్‌ కార్యకర్తలను అంతం చేయడమే కాకుండా ఆర్ధికంగా వారిని దెబ్బ తీయడం కోసం, భయకంపితులను చేయడం కోసం వారి వ్యవసాయ పంటలను, ఇళ్లను, ఇంటి సామానులను, పాఠశాల భవనాలను, మోటార్‌ వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. సిపిఐ(యం) అసహన, అప్రజాస్వామిక ధోరణిని వెంటనే కట్టడి చేయాలి. చిన్న చిన్న విషయాలపై సహితం సంచలన అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు ఈ హింసాయుత దాడుల పట్ల మౌనం వహించడం దురదష్టకరం.

ఇటువంటి అత్యాచారాలు, దారుణమైన హత్యలు జరుగుతున్నా సంఘ కార్యకర్తలు దిగ్వణీకత ఉత్సాహంతో సంఘ సందేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి కతనిశ్చయంతో ఉండటం గర్వం కలిగిస్తుంది. పైగా, వివిధ క్షేత్రాలలో సంఘ కార్యక్రమాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు పెద్దఎత్తున ఈ కార్యక్రమాలకు మద్దతుగా, సహకారం అందిస్తూ ముందుకు వస్తున్నారు. హింసకు పాల్పడుతున్న వారిపై తక్షణం తగు చర్యలు తీసుకోవడంతో పాటు కేరళలో చట్టబద్ధ పాలన ఉండేటట్లు చూడాలని కేరళ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా అఖిల భారతీయ కార్యకారిణి మండలి విజ్ఞప్తి చేస్తున్నది.