నేటి ప్రపంచ సంక్షోభానికి ఏకాత్మ మానవతా వాదమే పరిష్కారం- ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి తీర్మానం-2నిత్యమైన భారతీయ దష్టి కోణం ప్రాతిపదికగా పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం తోనే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం అని ఆర్‌.ఎస్‌.ఎస్‌.అఖిల భారతీయ కార్యకారిణి మండలి భావిస్తున్నది. ఈ చింతనకు ఆధారం ప్రపంచంలో జీవిస్తున్న, జీవం లేని అందరి క్షేమంతో కూడిన సార్వత్రిక సంక్షేమం భావనతో స్ఫూర్తి పొంది ప్రపంచాన్ని ఒక సమగ్ర దష్టితో చూడటం.

నేడు ప్రపంచంలో పెరుగుతున్న ఆర్ధిక తారతమ్యాలు, పర్యావరణ అసమానతలు, ఉగ్రవాదం మానవత్వానికి తీవ్రమైన సవాల్‌గా పరిణమిస్తున్నాయి. అదుపులేని పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిస్టు సైద్ధాంతిక వర్గ సంఘర్షణలను అనుసరించడం కారణంగా నేడు ప్రపంచంలో పలు దేశాలలో నిరుద్యోగం, పేదరికం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలతో పాటు కొద్ది దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు మూడింట రెండు వంతులకు పైగా ప్రపంచ ఉత్పత్తులపై ఆధిపత్యం వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. జీవిత దక్పధాన్ని కేవలం భౌతిక అవసరాలపైనే కేంద్రీకరిస్తూ ఉండడంతో కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, మానసిక వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరగడం జరుగు తున్నది. విచక్షణారహితంగా ప్రకతిని ఉపయోగించు కోవటం వలన భూమి ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రమట్టం స్థాయి, వాయు-నీటి-భూ కాలుష్యం పెరుగుతూండటం, నీటి సంక్షోభం, భూసారం దిగజారుతూ ఉండటం, పలు సూక్ష్మజీవులు అదశ్యం కావడం వంటి సవాళ్లు అధ్వాన్న పరిస్థితులకు దారితీస్తున్నాయి.

మత మూఢత్వం, తీవ్రవాద రాజకీయ సిద్ధాంతాల నుండి స్ఫూర్తి పొందుతున్న ఉగ్రవాదం వికతమైన స్థాయికి వెళుతున్నది. దానితో బాలలు, వద్ధులు, మహిళలపై దారుణ హత్యలు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి పట్ల అఖిల భారతీయ కార్యకారిణి మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. వీటన్నింటిని ఏకాత్మ మానవతావాదం చింతనను అనుసరించడం ద్వారానే నిర్మూలించడానికి వీలవుతుంది. పరస్పర సహకారంతో, వ్యక్తిగత స్థాయి నుండి మొత్తం ప్రపంచానికి, దాని జీవావరణం, సమూహాలు, జాతులు, వ్యక్తులు, కుటుంబం, సమాజం, ప్రపంచం, మొత్తం జీవ ప్రపంచం, విశ్వముల మధ్య సంపూర్ణ సంబంధం ఏర్పాటు చేసుకోవాలి.

1992లో రియో-డి-జనేరో లో ఐక్యరాజ్య సమితి జరిపిన ధరిత్రి సదస్సులో 172 దేశాలు పాల్గొని ప్రపంచ శాంతి, సమ్మిళిత అభివద్ధి, పర్యావరణ పరిరక్షణలకు నిబద్ధతను ప్రకటించాయి. అయితే ఈ ఆదర్శాల నుండి ప్రపంచం నిరంతరం పక్కకు తొలుగుతూ వస్తున్నది. మరోసారి 2015లో పారిస్‌లో జరిగిన సదస్సులో ప్రపంచంలోని చాలా దేశాలు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి సంసిద్ధతను ప్రకటించాయి. ఈ లక్ష్యాల సాధనకు ప్రపంచంలో అన్ని దేశాలు కలసి వినియోగాన్ని అదుపు చేసుకొంటూ సామూహిక అభివద్ధి కోసం కషి చేయవలసి ఉంది. పౌరులు అందరూ కుటుంబం, సమాజం, ప్రకతుల మధ్య సమగ్ర సంబంధాలతో పోరాటాలు, ఘర్షణలు లేకుండా ప్రపంచంలో సమ్మిళిత సామరస్యాన్ని సాధించడం వీలవుతుంది.

ఈ సంవత్సరం పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ శత జయంతి సంవత్సరమే కాకుండా ప్రస్తుత కాలానికి తగిన నిత్యమైన భారతీయ దష్టికోణం ప్రాతిపదికగా ఆయన ఏకాత్మ మానవతావాద చింతన ప్రవచించిన 51వ సంవత్సరం. ఈ చింతనను అమలులోకి తీసుకురావడానికి ప్రస్తుత తరుణం సరైన అవకాశంగా భావిస్తూ స్వయంసేవకులతో సహా పౌరులందరూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచంలోని ఆలోచనాపరులైన నాయకులు ప్రకతితో సహా ప్రపంచ వ్యవస్థ అంగాలన్నింటి మధ్య సమన్వయం కోసం వీలయిన అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని అఖిల భారతీయ కార్యకారిణి మండలి పిలుపునిస్తున్నది. అందుకోసం తగిన ఒక అభివద్ధి నమూనాను రూపొందించడం కోసం తగిన ప్రయోగాలు జరపాలి. అప్పుడే ప్రపంచంలోని జీవులందరికి ఆనందకరమైన జీవనం గడపాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి, విశ్వజనీన సంక్షేమం సాధించడానికి వీలు కలుగుతుంది.