ప్రజాదరణ పదిలం2014 సంవత్సరంలో జరిగిన చారిత్రక ఎన్నికల సమయంలో ఎక్కువగా వినపడిన నినాదం ''హర హర మోది ఘర్‌ ఘర్‌ మోది'', మోది ప్రధానమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు యవద్దేశం ఎంతో పొంగిపోయింది. మోది ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటింది. ఆయనపై ఆదరణ ఏమైనా తగ్గుతుందేమోనని కొన్ని శక్తులు పొంచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీ.డీ.పీ అసోసియేట్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా 'నాయకుల ప్రజాదరణ'పై సర్వే నిర్వహించింది. వీటి ఫలితాలు ఇలా ఉన్నాయి. మోదిని ఉత్తమ ప్రధానిగా ప్రజలు కొనియాడుతున్నారు. 53% నుంచి 85% ప్రజలు మోదివైపు ఉన్నారు. కేజ్రీవాల్‌, రాహుల్‌కు 08%, సోనియాగాంధీకి 06% మాత్రమే. దీంతో కాంగీలు, కమ్మీలకు నిరాశ మాత్రమే మిగిలింది.