బల ప్రయోగాన్ని బలప్రయోగంతోనే ఎదుర్కొంటాం - లాల్‌ బహదూర్‌ శాస్త్రిపాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం ఆగిపోయి ఖచ్‌ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మీద సంతకాల సిరా తడిఆరకముందే పాకిస్తాన్‌ మళ్లీ మారువేషంలో కాశ్మీర్‌లో జొరబడిం ది. దానికి లాల్‌ బహదూర్‌ శాస్త్రి బలయప్రయోగాన్ని బలప్రయోగంతో నే ఎదుర్కొంటామని చెప్పారు. స్నేహపూర్వక వచనాలతో సర్పం దారికి రాదు కదా!.

 అందుకు ఒకటే మార్గం ఉంది. దాని కోరలను ఉడబెరకటమే. 1965 ఆగస్టు 13వ తేది నాడు లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో బలప్రయోగాన్ని బలప్రయోగంతోనే ఎదుర్కొంటాం. మనం నాశనమైన పర్వాలేదు భారతజాతియొక్క, భారతపతాకం యొక్క సమున్నత గౌరవాన్ని నిలిపి ఉంచేందుకు మనం కడదాకా పోరాడతాం. ఇంకొక సందర్భంలో చైనా భారత్‌మీద చేసిన ఆరోపణ లకు సమాధాన మిస్తూ చైనా ఆరోపణ అబద్ధం. భారత దేశం మీద చైనా దాడిచేస్తే మన స్వతంత్రం కోసం పోరాడేందుకు దృఢ సంక ల్పంతో ఉన్నాం. మన భూమియొక్క సమగ్రతను పరిరక్షించడంలో మనం చైనా శక్తిని చూసి జడియభోము.
- లాల్‌బహదూర్‌ శాస్త్రి