దీపావళి వేడుకలు''ఇంట్లో ఈగల మోత - బయట పల్లకి మోత'' అన్నట్లు ఉంది పరిస్థితి. ఏటా మనం జరుపుకునే దీపావళి పండుగకు ప్రపంచ ఖ్యాతి ఉన్నది. విదేశీయులు హిందువులను రెండు అంశాలతో గుర్తిస్తారు. ఒకటి - బొట్టు; రెండవది దీపావళి. ఇటీవల అన్ని హిందూ పండుగలను, ఉత్సవాలను వ్యతిరేకించడమే కొంతమంది దేశద్రోహులకు అలవాటుగా మారింది. కానీ, మన దీపావళి ఇతర దేశాలలో గౌరవం, మన్ననా పొందుతూ ఉండడం విశేషం. అమెరికా అధ్యక్ష అధికారిక నివాసం ''వైట్‌హౌస్‌''లో ప్రతి సంవత్సరం దీపావళి వేడుకను అధికారికంగా జరుపుతారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు.

25-10-2016 నాడు బ్రిటన్‌ ప్రధాని శ్రీమతి ''థెరిసా మే'' తన అధికార నివాసంలో అక్కడి భారతీయులకు దీపావళి విందు ఇచ్చారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడులు ప్రారంభించారు. ఆహుతులతో మాట్లాడుతూ ''ప్రధానిగా ఇలా మీకు తొలి దీపావళి విందు ఇవ్వటం తనకు ఎంతో ఆనందంగా ఉన్నదని'' ఆమె అన్నారు.