గృహ వైద్యం



1. చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో ప్రొటీన్లు, పీచు, ఐరన్‌, సోడియం, విటమిన్‌ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరైడ్‌ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

2. అల్లం పైత్యానికి విరుగుడు : అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతుంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్‌ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కీమో థెరపీతోపాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.

3. వెల్లుల్లి గుండెకు నేస్తం : పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్‌ మిశ్రమ పదార్ధాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్‌ ఇందులో మెండుగా ఉన్నాయి.

4. కుంకుమపువ్వు అందమైన ఆరోగ్యం : ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసన కోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్‌ నిరోధక గుణాలు ఉన్నాయి.

5. లవంగాలు శ్వాసకు మేలు : లవంగాలలోని యాంటీ బాక్టీరియల్‌ గుణాలు దంతరక్షణ నిస్తాయి. నోటిని,శ్వాసను తాజాగా ఉంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటి సెప్టిక్‌, యాంటీ బయోటికి ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.

6. జీర్ణశక్తికి జీలకర్ర : జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్‌ డీహైర్‌ అనే పరిమళం లాలాజల గ్రంథులను క్రియాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.

7. ఆవాలు : ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.

8. నల్లమిరియాలు : ఘాటుగా ఉండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్‌ యాసిడ్స్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్‌ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందులనుంచి ఉపశమనం ఇస్తుంది.

9. పచ్చి యాలకులు : ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి యాలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు యాలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తాయి. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.

10. ఫెన్నల్‌ : ఇది మరువంలాంటి మొక్క. దీన్ని కూరల్లో వాడతారు. ఫెన్నెల్స్‌ డైయూరిటిక్‌ గుణాన్ని కలిగి ఉంది. ఇది ఋతుస్రావ సమయంలోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొత్తికడుపులకు ఉపశమనాన్నిచ్చే శక్తి ఫెన్నల్‌ తైలానికి ఉంది. పాలిచ్చే తల్లులలో పాలు సమృద్ధిగా ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది.