దుష్ప్రచారం మిధ్య! సరస్వతి సత్యంహిందూవులకు ఉన్న అసంఖ్యాకమైన తీర్థాలలో ప్రయాగ ఒక ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. ఇక్కడి గంగ, యమున, సరస్వతి త్రీవేణి సంగమం జగత్ప్రసిద్ధం. ఇది అంతా బోగస్‌ సరస్వతి, గిరస్వతి ఏమి లేదు. అంతా మూఢనమ్మకం అని సూడో మేధావులు కొట్టి పారేస్తుంటారు. హర్యానా ప్రభుత్వం నియమించిన ఒక నిపుణుల సంఘం సుధీర్ఘంగా పరిశోధనలు జరిపి సరస్వతీ నది ఒకప్పుడు ఉండేదని సంఘం అధ్యక్షుడు మరియు భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు పద్మభూషణ్‌ కె.ఎస్‌.వైద్య ధ్రువీకరించారు. సరస్వతీ నది యొక్క మూడు వంకలు భారత్‌లోను, ఒక భాగం ఇప్పటి పాకిస్తాన్‌లో ప్రవహించిందని చెప్పారు. హిమాలయాలలో జన్మించి హర్యానా, రాజస్తాన్‌, గుజరాత్‌ల మీదుగా ప్రవహించి రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ద్వారా సింధూ సాగరంలో సంగమం అయ్యేదని వివరించారు.