శాంతి కోసం అవసరమైతే కఠినంగా వ్యవహరించాలిఇస్లాం చరిత్రను, వర్తమాన కాలంలో ఇస్లాం దేశాలను, ప్రపంచంలో వివిధ దేశాలల్లో ఉన్న ఇస్లాం మతస్థులను గమనించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవు తుంది. ఇస్లాం అనుయాయుల్లో ఆక్రమణ, అశాంతి, అసహనం అనేవి వారి మౌలిక లక్షణాలుగా కనబడుతున్నాయి. ఇస్లాం ప్రమాదంలో పడిందని దానిని మరింత రెచ్చగోట్టే వ్యవస్థ కూడా వాళ్లల్లో ఉన్నట్టు కనబడుతోంది. దీనికి వారి సిద్ధాంతం కారణమా.. లేక వారి బోధకులు కారణమా.. గమనించవల్సిన అవసరం ఉంది. ఆక్రమణ, అశాంతి, అసహనంతో పాటు విద్వేషం కూడా తోడైతే పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఇక వర్ణించ వలసిన అవసరం లేదు. అటువంటి దానికి ఒక సజీవ ఉదాహరణ పాకిస్తాన్‌. పాకిస్తాన్‌ ఏర్పాటు అగ్రరాజ్యల ఎత్తుగడతో పాటు శతాబ్దాలుగా ఇస్లాంకు భారత్‌లో ఎదురైన అనుభవం, దాని నుంచి పుట్టిన విద్వేేషం కారణం. పాకిస్తాన్‌ ఏర్పడినప్పటి నుంచి అక్కడి ప్రజలకు ఏదో కారణం చూపించి భారత్‌పై విద్వేషాన్ని నిర్మాణం చేయటం, దానిని అట్లాగే కాపాడుకోవడం ఆ దేశ పాలకుల మౌలిక విధానం. దాని కారణంగా పాకిస్తాన్‌ ఏర్పడిన కొన్ని నెలల్లోనే కాశ్మీర్‌పై అక్రమణలకు దిగింది. చావు దెబ్బతిని అది వెనక్కు వెళ్ళి పోయింది. చావు దెబ్బతిన్నా అది తాత్కాలికమే అని అప్పటి నుండి చూపిస్తూనే ఉంది. అవకాశం దొరికిన చోటల్లా కాశ్మీర్‌ను సాకుగా చూపి భారత్‌పై తమ విద్వేషాన్ని అక్కడి పాలకులు ప్రకటిస్తూనే ఉన్నారు. పాక్‌ ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలు, కాశ్మీర్‌ లోయలోని వేర్పాటువాద శక్తుల కార్య కలాపాలు రెండు కలిసి కశ్మీర్‌ను దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలని చేయని ప్రయాత్నం లేదు. దానికి తోడు కశ్మీర్‌ లోయలో పోలీసుల చేతుల్లో బృర్హన్‌వని ఉగ్రవాద నాయకుడు చనిపోవడం మరింత రెచ్చిపోతున్నది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దానిని అదుపు చేయాలని ఓ చిన్న ప్రయాత్నం చేసింది. అదే సర్జికల్‌ దాడి. ఆ దాడితో పాకిస్తాన్‌కు ఏదో అర్థమవుతుందని దాడులను ఆపేస్తుందని అనుకోవటమూ మన భ్రమ. అప్పటి నుంచి ఇంక రెచ్చిపోతునే ఉన్నది. తాజాగా కశ్మీర్‌ లోయలో పాఠశాలలపై దాడులు చేసి వాటిని కూల్చడం సామాన్య ప్రజలను హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేయడమనేది కొద్ది రోజులుగా పెరిగిపోతున్నది. సర్జికల్‌ దాడుల తర్వాత పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇప్పటి వరకు 60 సార్లు ఉల్లంఘించింది. పాకిస్తాన్‌లో అంతర్గతంగా పెచ్చుమీరుతున్న ఉగ్రవాద దాడుల నుంచి ఆ దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరింత ఆర్భాటం చేస్తున్నది. నియామాలను పాటించటమూ.. పాటించకపోవటమూ వాళ్ల ప్రయోజనమే కారణ మవుతోంది. మన లాగా మాట ఇచ్చాము కాబట్టి ఏ పరిస్థితులలోనైన దానికి కట్టుబడి ఉండాలని ఇస్లాం మతస్తులకు ఉండదు. అందులో పాకిస్తాన్‌ సైన్యానికి పాలకులకు అస్సలు ఉండదు. భారత్‌తో శత్రుత్వము నిరంతరము కాపాడుకోవడమే ఆ దేశం యొక్క మౌలిక విధానం. దానిని మన వాళ్లు అర్థం చేసుకుని ఉండవచ్చు. కాని మన నుండి ఏదో ప్రయాత్నం చేయాలని పాకిస్తాన్‌తో మేము స్నేహంగానే ఉన్నామని ఈ దేశ ప్రజలకు, అగ్రరాజ్యాలకు చూపించాలనే తాపత్రయం స్వతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన దేశంలోని పాలకులు, రాజకీయ పార్టీలు ఏవో మాట్లాడుతూ ఏవో విన్యాసలు చేస్తూ అంతిమంగా భంగపడటం మళ్లీ లేచి అవే ప్రయత్నాలు కొనసాగించటం మన నైజంగా మారిపోయింది. ఆ నైజం కారణంగానే ఇప్పటికే అవసరానికి మించి ఎంతో నష్టపోయాం. ఇంకా నష్టపోతూనే ఉన్నా. శాంతిని సాధించడానికి అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరించాలని మన దేశ చరిత్ర చెబుతున్నది. అయినా దానిని గుర్తించలేని స్థితిలో మన పాలకులు, ప్రజలు చిక్కుకు పోవటం దురదృష్టకరం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇస్లాం మతస్తులు మన దేశంలోనే ఉన్నారు. మనం కఠినంగా వ్యవహరిస్తే వాళ్లు ఏమనుకుంటారో అని వాళ్లు ఎక్కువగా ఏమీ అనుకోకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణను మన దేశ పాలకులు అనుసరిస్తూ వచ్చారు. కొద్దో గోప్పో తేడాతో అదే ఇప్పటికీ అమలు జరుగుతోంది. ఈ మానసికత నుండి ఈ దేశ ప్రజలు, పాలకులు బయటపడనంతవరకు మనలను శత్రువులుగా చూస్తున్న వారి నైజాన్ని, ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టలేము. ఈ విధానాలకు స్వస్తి చెప్పి దేశం యొక్క సార్వ భౌమత్వాన్ని కాపాడుకొనేందుకు కృతనిశ్చయంతో ప్రభుత్వం, ప్రజలు ఉన్నప్పుడే పాకిస్తాన్‌తో మనము స్పష్టంగా ఉండగలుగుతాము. కశ్మీర్‌ సమస్య పరిష్కరించుకోగలుగుతాము. ఈ దిశలో మన ఆలోచనలు సాగినప్పుడు ఏదో మార్గం మనకు కనబడుతుంది.