మనం యుద్ధంలోనే ఉన్నం అప్రమత్తత అవసరం


పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా జియ హుల్‌ హాక్‌ ఉన్న కాలం నుండి కాశ్మీర్‌ను కబళించడానికి పాకిస్తాన్‌ భారత్‌పై ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభించింది. నిరంతరం గాయపరచడం అనేది ఆ యుద్ధం లక్ష్యం. అది అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్‌ అనుసరిస్తున్న ఆ యుద్ధ వ్యూహాన్ని ప్రారంభంలోనే భారత్‌ కట్టడి చేయవలిసి ఉండేది కానీ అలా చేయలేదు. దాని కారణంగా పాకిస్తాన్‌ పెట్రేగిపో తూ వచ్చింది. దాడుల నుంచి కాపాడుకోవటం లేక కాచుకోవటం అనే విధానం భారత్‌కు తీరని నష్టం కలిగించింది. దాని పరాకాష్టే మొన్నీ మధ్యన జరిగిన ఉరి సంఘటన.

 నిద్రలో ఉన్న 18మంది సైనికులను అతిదారుణంగా పాకిస్తాన్‌ ఉగ్రవాదులు చంపేశారు. దానిపై దేశమంతా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దానికి ప్రతీకార చర్య జరగాలని ప్రజలనుంచి చాలా తీవ్రమైన స్పందన వచ్చింది. ఇటువంటి స్పందన భారతదేశంలో ఒక అరుదైన సంఘటన. ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఏకాకిని చేయటానికి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ ప్రారంభించింది. పాకిస్తాన్‌లో జరగబోయే సార్క్‌ సమావేశాలలో భారత్‌ పాల్గొన దని తెగేసి చెప్పింది. దీనికి మద్ధతుగా ఆఫ్ఘనిస్తాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ కూడా మేము పాల్గొనమని తెగేసి చెప్పారు. దాని కారణంగా సార్క్‌ సమావేశాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సింధు జలాల విషయంలో, పాకిస్తాన్‌కు భారత్‌ ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు కూడా రద్దు చేయడానికి చర్చలు ప్రారంభించింది. ప్రత్యక్ష యుద్ధం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. కానీ ఒక తీవ్రమైన హెచ్చరిక చేయాలనే విషయంలో బేధాభిప్రాయాలు లేవు. పరిమిత దాడులతో పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని నిర్ణయిం చుకుంది. ఆ నిర్ణయ పర్యవసనమే సర్జికల్‌ స్ట్రైక్స్‌. బుధవారం అర్థరాత్రి నియంత్రణ రేఖ దాటివెళ్ళి పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా భారత్‌ మెరుపుదాడి చేసింది. ఆ దాడిలో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నలభై మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. 200 మంది ఉగ్రవాదులు చెల్లాచెదు రై పారిపోయారు. ఈ దాడిలో కొద్దిమంది పాకిస్తాన్‌ సైనికులు కూడా మరణించినట్లు సమాచారం. ఈ నిర్ణీత లక్ష్యా న్ని నాలుగు, నాలుగున్నర గంటల్లోనే పూర్తిచేయటం విశేషం.

ప్రపంచంలో చైనా నుంచీ మొదలుకొని అనేక దేశాలు భారత్‌ చర్యను సమర్థించాయి. పాకిస్తాన్‌కు ఆర్థికంగా, ఆయుధ పరంగా అన్ని రకాల అండదండలు అందించే అమెరికా కూడా భారత్‌ చర్యను సమర్థిస్తూ దాడికి పాకిస్తానే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. ఈ పరిమిత దాడులతో సమస్య సమసిపోదు పైగా ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రత్యక్ష యుద్ధం చేయకపో యినా మనం యుద్ధంలోనే ఉన్నాం అన్న విషయాన్ని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు గుర్తించి వ్యవహరిస్తే పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవచ్చు.