భారత్‌తో సంబంధాలు చాలా విలువైనవి2014 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాల అసమర్థతవల్ల ప్రపంచంలో భారత్‌ ఏకాకి అయింది. 2014 నుండి ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు బలపరచుకుంటున్నది. అమెరికా ఎన్నికలలో కూడా 'భారత్‌తో సంబంధాలు' అనే అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇలా అంటున్నారు.''భారత్‌తో పాటు హిందూవులకు నేను పెద్ద అభిమానిని. ప్రవాస హిందూవులు, భారతీయ అమెరికన్లు మా దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. నేను విజయం సాధిస్తే భారతీయులకు శ్వేత సౌధంలో ఒక మంచి మిత్రుడు దోరుకుతాడు.'' ఇది ఇలా ఉండగా ఎవరు అధ్యక్షులుగా గెలిచినా, వారు 100 రోజుల లోపున మోదిని కలవాలి; భారత్‌తో సంబంధాలకు పెద్దపీట వేస్తారని అంటున్నాయి అమెరికా పత్రికలు.