రథ సప్తమి సందేశం

విత్తు మొలకెత్తడానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడుగటానికి, మొగ్గ పువ్వులా వికసించటానికి, పువ్వు కాయగా మారటానికి కాలమే కారణం. కాలానికి పురో గమనమే కానీ తిరోగమనమే లేదు. అట్టి కాలం యొక్క వేగాన్ని తెలుసుకోవాలంటే సూర్య గమన మే ప్రమాణం. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.

కాలం కంటికి కనపడదు కానీ కాలానికి ప్రమాణమైన సూర్యడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంగా కొలుస్తాము. సూర్యుడి వలనే ఈ సమస్త ప్రకృతి చైతన్య వంతం అవుతుంది.
సప్తాశ్వరథ మారూఢం
ప్రచండం కశ్య పాత్మజం
శ్వేత పద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

ఏడు గుర్రలు పూనిన రథాన్ని అధిరోహిం చి, నిరంతర సంచారం చేసే కశ్యపుని కుమారు డైన సూర్యునకు నమస్కారం అని స్తుతిస్తాము. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. సూర్యు డుని ఆధారం చేసుకోని మిగిలిన గ్రహలు సంచరిస్తాయి. సూర్యుడు లేకపోతే తక్కిన గ్రహలకు మనుగడే లేదు. అందుకే సూర్య జయంతి అయిన రధసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు సూర్యుడిని ఆరాధించటం ఆచారమైంది.

మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా ఈ బ్రహ్మండంలో ఇంకా 12మంది సూర్యులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన ప్రాచీన రుషులు ఈ ద్వాదశాదిత్యులను గుర్తించారు. వారే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరులు.ఉత్తరాయణం మకరసంక్రమ ణంతో ప్రారంభమైనా రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరి స్తుంది. దక్షిణాయణం నుంచి సూర్యుడు విముక్తిడై రథసప్తమి నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు లు రేగుపండ్లు తలపై పెట్టుకోని స్నానం చేస్తారు. జిల్లేడు, రేగు చెట్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకోనే వృక్ష జాతులు. వీటి ప్రభావం శరీరంపై సంవత్సరమంతా ఉంటుందని ఆరోగ్యరీత్యా మన పూర్వికులు నిర్ణయించారు.

- పి.వి. సత్తిరాజు