మిజోరాంలో క్రైస్తవుల మిషనరి డే సెలవు

ప్రభుత్వ కార్యాలయాల్లో రాముడు, అమ్మవారి చిత్రాలు ఉండరాదు అని కొంత మంది వాదన. దానికి వారు చెప్పే కారణం మనదేశం ''సెక్యులర్‌'' అని. ముస్లింలు నమాజు చేసుకోటానికి కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు. సెక్యులరిజానికి ప్రమాదం లేదు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ఒక అడుగు ముందుకు వేసి సెక్యులరిజాన్ని అధికారికంగానే ''హత్య'' చేసింది. ఒక శతాబ్దం క్రిందట అస్సాం నుంచి వచ్చిన లోరియన్‌, సావిడ్‌గే అనే ఇద్దరు క్రైస్తవ మిషనరీలు ప్రజలను మభ్యపెట్టి, మోసగించి, బెదిరించి మతం మార్చారు. నేడు మిజోరం వంద శాతం క్రైస్తవ రాజ్యం. జనవరి 11, 2017 (బుధవారం)న రాష్ట్ర ప్రభుత్వం లోరియన్‌, సావిడ్‌గేలు అక్కడ అడుగుపెట్టిన రోజుని ''మిషనరీ డే'' అంటూ అధికారికంగా జరిపింది. సెలవు దినంగా ప్రకటించింది. రాముడు పేరు తలిస్తే మతోన్మాదం. కానీ విదేశీ విద్రోహులను, వారి మతాన్ని అధికారికంగా గౌరవించడం మాత్రం మతోన్మాదం కాదా.! ఇదెక్కడి న్యాయం.!