వెయ్యేండ్ల గణపతి విగ్రహం ధ్వంసం, పునఃప్రతిష్ట

ఛత్తీస్‌గఢ్‌లోని ఒక పర్వతంపై ఉన్న వెయ్యేండ్ల నాటి గణపతి విగ్రహం విధ్వంసానికి గురైంది. సముద్ర మట్టానికి దాదాపు 2,994 మీటర్ల ఎత్తు లోని డోల్‌కల్‌ పర్వత శిఖరాగ్రంపై ఉన్న గణేశ్‌ విగ్రహాన్ని చూసేందుకు తరచూ పర్యాటకులు, భక్తు లు రావడం నచ్చని మావోయిస్టులు దీనిని ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నారు. మావో యిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే దంతేవాడ జిల్లా బైల డిల్లా అటవీ ప్రాంతంలో ఈ డోలకల్‌ పర్వతం ఉంది. 56ముక్కలై ఉన్న విగ్రహాన్ని పర్వతం కింది భాగంలో గుర్తించారు. దీనిపై దర్యాప్తు జరుపు తున్నామని దంతెవాడ ఎస్పి కమ్లోచన్‌ కశ్యప్‌ చెప్పా రు.

ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్క తిక శాఖ మంత్రి దయాళ్‌దాస్‌ భాగెల్‌ చెప్పారు. విగ్రహ ధ్వంసం మావోయిస్టుల పనేనని బస్తర్‌ ఐజి కల్లూరి వెల్లడించారు. ఈ విగ్రహాన్ని 9లేదా 10వ శతాబ్దంలో నాగవంశ రాజులు ప్రతిష్టించినట్టు చెప్తుంటారు. అక్కడికి చేరుకోవడానికి రోడ్డు మార్గం లేదు. కాలి నడకనే చేరుకోవాలి. ఇదే పర్వతానికి సమాంతరంగా మరో పర్వతంపై ఉన్న సూర్యదేవుని విగ్రహం సైతం 15ఏండ్ల క్రితం ఇదే తరహాలో ధ్వంసం కావడం గమనార్హం. దీన్ని గుర్తించిన పోలీసుల వారంరోజుల పాటు కష్టపడి పునఃప్రతిష్టించారు.