వివేకం.. యువత మమేకం..యువజాగరణలో సంస్కృతీ ఫౌండేషన్‌

'ఈ దేశం మీ చేతుల్లో ఉంది' అన్న వివేకా నందుని పిలుపు.. యువత హదయాలలో ఎల్లప్పుడు మార్మోగి, ఈ దేశ పౌరుల్ని విలువలున్న, ఉత్తమ గుణాలు కలిగిన వివేకవంతులుగా తయారుచేయాల్సిన అవసరం వచ్చిందంటోంది హైదరాబాద్‌కు చెందిన 'సంస్కతి ఫౌండేషన్‌'. వివేకానంద జయంతిని పురస్కరించుకుని పలు స్ఫూర్తి దాయక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది. 

చేయి చేయి కలిపి..
వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి 26 వరకు ఒక ఉద్యమంగా కొన్ని కార్యక్రమాలను చేస్తోందీ సంస్థ. ''సౌశీల్య నిర్మాణం, సామాజిక లక్ష్యాల అభివద్ధి పట్ల యువత దృష్టి సారించేటట్లు చేయడమే మా వివేక ఉద్యమ లక్ష్యం'' అంటున్నారు సంస్థ ప్రతి నిధులు. ఆ ఉద్యమంలో ముఖ్యమైన అంశం చేతికి ధరించే 'వివేక్‌బ్యాండ్‌'. ఇది ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ లాంటిదే. దీనిపై 'మంచిగా ఉండు, మంచి పని చెయ్యి' అన్న నినాదం ఉంటుంది. ఈ బ్యాండ్లను వీలైనంత ఎక్కువ మంది యువతకు చేరవేసేందుకు సంస్థ కషి చేస్తోంది. ''సంస్థ భావాల ప్రచారం కోసం సోషల్‌మీడియా, వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌లను వాడుకుంటున్నాం. మా ప్రచారంలో భావ సారూప్యత కలిగిన సంస్థలు, విద్యాకేంద్రాలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సినీతారలు, రేడియో జాకీలు పాలు పంచుకుంటుండం విశేషం..'' అని సంస్థ ప్రతినిధులు అన్నారు.

పదిమంది మేలు కోరి..
పెద్దల పట్ల గౌరవమర్యాదలు తగ్గిపోతున్న తరుణంలో.. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు - మానవ సంబంధాల పునరుద్దరణ మీద కూడా దష్టి పెట్టింది సంస్కృతి పౌండేషన్‌. మసక బారుతున్న జాతీయభావాన్ని పెంపొందిం చేందుకు - మన జాతీయగీతం, పతాకం, చిహ్నాలను గౌరవిం చాలన్నది మరో ముఖ్య అంశం. ఇక, సేవాభా వాన్ని రగిలించేందుకు యువతను.. ఆ దిశగా మేల్కొల్పుతున్నదీ సంస్థ.