గుడిబండ రామ్‌మందిరం - వనవాసి మరియు నగరవాసి మహిళల సంగమం

భాగ్యనగర్‌ సంభాగ్‌ వనవాసి కళ్యాణ్‌ పరి షత్‌ మహిళా విభాగం మరియు అచ్చంపేట్‌ మండ లం లోని గుడిబండ గ్రామస్తులు కలిసి కొన్ని అని వార్య కారణాల వలన ఆగిపోయిన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 9వ తేదీన ఒక ఉత్సాహ పూరితమైన వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో ''విగ్రహం ప్రతిష్ఠ'' కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం ఒక వనవాసి మరియు నగర వాసి మహిళా సంగమంలా కనిపించింది. నాలుగు సంవత్సరాల క్రితం, భాగ్యనగర్‌ సంభాగ్‌ (హైదరా బాద్‌ మరియు సికింద్రాబాద్‌) వనవాసి కళ్యాణ్‌ పరిషత్‌ మహిళా విభాగం నాగర్‌ కర్నూలు జిల్లా, అచ్చంపేట్‌ ''మల్లికార్జున నిలయం'' విద్యార్థుల పోషణ బాధ్యతను స్వీకరించింది. ఈ వసతి గహం లో చెంచు తెగకు చెందిన పిల్లలు ఉంటారు. 
 తరు వాతి సంవత్సరం కళ్యాణ పరిషత్‌ మహిళా విభా గం పూర్తిగా వసతి గహం నిర్వహణకు అయ్యే ఖర్చులు బాధ్యతను స్వీకరించింది. అందులో భాగం గానే ''మల్లికార్జున విద్యార్థి నిలయం'' నుండి సుమారు 12కిలో మీటర్ల దూరంలో ఉన్న గుడిబండ గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. గుడిబండ ప్రధానంగా చెంచులు నివసించే గ్రామం. చెంచులు ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలో నివసించే ఒక తెగ. తాము నరసింహస్వామి భక్తురాలు అయిన చెంచులక్ష్మి వారసులమని వీరు నమ్ముతారు.
ఈ ప్రాంతంలో వనవాసి కళ్యాణ్‌ ఆశ్రమం పని కారణంగా, చాలామంది గ్రామస్తులకు ఈ సంస్థ గురించి అవగాహన ఏర్పడింది. అందుకనే అక్కడ మహిళలు ''మాకు భిక్ష అవసరంలేదు, ఇలా మార్గం చూపే వారుంటే చాలు'' అని భావించారు.
కొంతకాలం క్రితం వనవాసి కళ్యాణ్‌ పరిషత్‌ ఈ గ్రామంలో ఒక ఆలయం నిర్మాణాన్ని ప్రారం భించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ పని పూర్తికాలేదు. మధ్యలో ఆగిపోయిన రామా లయ నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుందని గ్రామీణ మహిళలు అన్నారు.అంతే వారి శ్రద్ధాభక్తులను గమనించిన భాగ్యనగర్‌ వనవాసి మహిళా విభాగం గ్రామస్తులతో కలిసి మధ్యలో ఆగిపోయిన ఆలయ నిర్మాణం పూర్తి చేసే పని చేపట్టింది. అందుకు కావలసిన నిధుల సేకరణ చేసి, ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
ఈ దైవకార్యంలో పాలుపంచుకునేందుకు అనేకమంది ముందుకువచ్చారు. ప్రఖ్యాత వేద పండితులు బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గురూజీ సైతం ఈ బందంలో చేరారు. గుడిబండ గ్రామం లో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించడం కోసం భాగ్య నగర్‌ వనవాసి కల్యాణ పరిషత్‌ బందానికి చెందిన ఒక మహిళా కార్యకర్త ఇంట్లో డిసెంబర్‌ 25 నుండి 31డిసెంబర్‌ 2016, వరకు రామ కథను నిర్వహించారు. సుమారు 300మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 9 ఫిబ్రవరి 2017 మాఘ శుద్ధ త్రయోదశి నాడు విగ్రహ ప్రతిష్ట చేయాలని కాప్రే గురూజీ ముహూర్తం నిర్ణయించారు.
గుడిబండ గ్రామంలో 26 జనవరి 2017న భారతమాత పూజ ఘనంగా జరిగింది. తర్వాత 26 జనవరి నుండి 2 ఫిబ్రవరి 2017 వరకు గ్రామస్తులు సమీపంలోని పది గ్రామాలకు వెళ్ళి భిక్షాటన ద్వారా బియ్యం, కందిపప్పు, చింతపండు, చక్కెర, నూనె, ప్రసాదానికి కావల్సిన సామానులు సేకరించారు. నగరంలోని మహిళలు పూజ సామాగ్రి సేకరించారు.
ఫిబ్రవరి 2 నుండి అఖండ రామ నామ సంకీర్తన ప్రారంభించారు. ఫిబ్రవరి 7న ఆలయ విగ్రహాలతో శోభా యాత్ర జరిగింది. ఫిబ్రవరి 9న అత్యంత భక్తి, శ్రద్ధా, ఉత్సాహాల మధ్య నడుమ ''విగ్రహం ప్రతిష్ఠ'' చేశారు. ఆలయంలో నిత్య పూజ బాధ్యత గ్రామస్తులు తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం గ్రామంలో ఒక పిండి మిల్లు కోసం విరాళాలు సేకరించారు. అయితే అలా ఏర్పాటుచేసిన పిండి మిల్లు నుండి వచ్చిన లాభంలో సగభాగం ఆలయానికి, గ్రామం కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన వేదపండితులు చెంచు పిల్లల హాస్టల్‌లో వారితోపాటు ఐదు రోజులు పాటు గడపడం ప్రస్తావించ దగిన అంశం. వెయ్యి మందికి పైగా సమీప గ్రామ ప్రజలు మూడు రోజుల పాటు ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇరవై కుటుంబాలు భాగ్యనగర్‌ నుంచి ఈ వేడుకలకు హాజరయ్యారు. -పరిమళ నడింపల్లి