ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచి, పట్టాభిషిక్తుడయిన
రోజును (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) ఇప్పుడు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా
జరుపుకుంటున్నాము. శివాజీకి ముందు, ఆ తరు వాత కూడ అనేకమంది రాజులు
సామ్రాజ్యాలను ఏర్పరచారు. కాని వాటిని వేటిని 'హిందూ సామ్రాజ్యాలు' అని
ప్రత్యేకంగా చెప్పుకోవటం లేదు. శివాజీ తన సామ్రాజ్యాన్ని ఏర్పరచినప్పటి
పరిస్థితులు, అందుకై అనుసరించిన పద్ధతుల వల్ల అది ప్రత్యేకమయ్యింది.
ఐతే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృధ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలివేసాడు. కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచి నప్పుడు మాత్రం పృధ్వీరాజుని బంధించాడు. అనేక హింసలకు గురి చేసాడు. ప్రజల్ని హింసించాడు, దోచుకున్నాడు.
హిందూ జాతికి తురుష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం, ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్టపరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు.
ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికీ హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మతం ఏమి చెపుతోందో, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తరచి చూసుకోకుండా అన్ని మంచినే బోధిస్తాయి, అవి అన్నీ ఒకటే అన్న విపరీత ధోరణి వల్ల వాటినుంచి వస్తున్న దాడులను అర్థంచేసుకుని, ఎదుర్కొనడంలో హిందూ సమాజం విఫలమవుతోంది.
ఈ రకమైన వివేచనారహిత ఆలోచనా విధానం స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. ఐతే రామజన్మభూమి ఉద్యమం తరువాత హిందువులలోని ఈ ఆత్మహత్యాసదృశమైన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.
దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాము. కాని పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన రోజునే శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలం. దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం, శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే 'స్వరాజ్యం', 'సురాజ్యం' సాధ్యమవుతాయి.