దేశంలో ధార్మిక స్థలాలలో వినియోగిస్తున్న లౌడ్‌స్పీకర్ల గురించి చర్చ
జరుగుతోంది. ముంబాయికి చెందిన 66సం||ల మహ్మద్ అలీ ఆలియాస్ (బాబుబయ్య)
మసీదులలో లౌడ్‌స్పీకర్ల ద్వారా ఆజాన్‌ను చెప్పే పద్ధతి ఇస్లామిక్ పద్దతి
కాదని, వాటిని తొలగించాలని అంటున్నారు. లౌడ్స్పీకర్లను ఉపయోగించకపోవడం వలన
ఇస్లాంకు వచ్చిన నష్టమేమి లేదని, 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం ఏర్పాడిన
నాటి నుంచి అవి మతంలో భాగం కాదని అంటున్నారు.
ఈమేరకు ముంబాయి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఈమేరకు ముంబాయి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఆగస్టు 2016లో సంతోష్ పచలిక్, డా. బెడెకర్ మరియు మహ్మద్ అలీల పిటిషన్లపై ముంబాయి హైకోర్టులో జస్టీస్ ఓక్ మరియు జస్టీస్ సయ్యాద్ తమ తీర్పులో ధార్మిక స్థలాలో లౌడ్ స్పీకర్లను రాత్రి పది నుంచి ఉదయం 6గం||ల వరకు దేశ వ్యాప్తంగా ఎక్కడైన ఉపయోగిస్తే ఒక లక్ష రూపాయల జరిమానా లేదా 5సం||ల జైలు శిక్ష విధించవచ్చని తీర్పునిచ్చారు.
ఉత్తరాఖండ్ లో సరస్వతి విద్యా మందిర్ విద్యార్థుల జయకేతనం
ఉత్తరాఖండ్ ప్రభుత్వం విడుదల చేసిన 10, 12 వ తరగతి ఫలితాలలో విద్యాభారతి అద్వర్యంలో నడుపబడుతున్న సరస్వతి విద్య మందిర్ పాథశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేసారు. 12వ తరగతి బోర్డ్ పరిక్షలలో మొదటి పది స్థానాలకు ప్రకటించిన 13మంది విద్యార్థులలో 11మంది సరస్వతి విద్యా మందిర్ విద్యార్థులు. 10వ తరగతి ఫలితాలలో 2వ స్థానం చేజికించుకున్న విద్యార్ధి సైతం శిశు మందిర్, అందులో మెరిట్ ఆధారంగా ప్రకటించిన 10స్థానాలలో 12 మంది విద్యార్థులలో 7గురు విద్యాభారతి పిల్లలే. మెరిట్ ఆధా రంగా 25స్థానాలకు ప్రకటించిన 86 మంది విద్యార్థుల లో 50మంది సరస్వతి శిశు మందిర్ పిల్లలు. విద్యా భారతి ద్వారా ఉత్తరాఖండ్ లో 652 పాఠశాలలు నడు పబడుతున్నాయి. అందులో దాదాపు 514 ప్రాథమిక, 138 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యాభారతి ప్రదేశ్ నిరిక్షన్ డా. విజయపాల్ సింగ్ గారు మాట్లాడుతూ సుదూర గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యతగ అందిం చడంతో పాటు, దేశ భక్తీ సంస్కర పూరితమైన గుణ గణాలను పిల్లలకు అందించడమే సరస్వతి విద్య మందిర్ విద్యావిధానంలో ఒక భాగం అని అన్నారు.
స్వదేశకాంతి
''ఉందిలే మంచి కాలం ముందూ ముందునా..'' అని ఒక పాత చలనచిత్ర గీతం ఉన్నది. భారతీయులు విదేశీయ మత్తులో మునిగి అన్నీ విదేశీ వస్తువులే కావాలనుకుంటున్న కాలం గతించింది. ఇప్పుడు భారతీయత ఉరకులు వేస్తున్నది. భారత్‌లో టూత్‌పేస్టు మార్కెట్లో కొల్గేట్పామాలివ్ మరియు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీలు రాజ్యమేలేవి. కొల్గెట్, సిబాకా, క్లోజప్ వంటి ఉత్ఫాదనలు భారతీయులు అత్యధికంగా వాడేవారు. కానీ ఇప్పుడు విదేశి కంపెనీలకి కష్టోలొచ్చాయి. రాందేవ్ బాబా పతంజలి ఉత్పాదన-దంత కాంతి ప్రస్తుతం అతి ఎక్కువ కొనుగోలు అవుతున్నది. డాబర్ ఎర్ర టూత్ పేస్టు కూడా అమ్మకాలు పెరిగాయి. కొల్గేెట్ పామాలివ్ మార్కెట్షేర్ 2016సం||లో 57.4% నుంచి 55.6%కి పడిపోయినట్లు కంపెనీ ప్రకటించింది.
పెప్స్డెంట్, క్లోజప్ అమ్మకాలు 0.5% క్షీణించాయి. డాబర్ అమ్మకాలు 1% పెరిగాయి. డాబర్ రెడ్ టూత్‌పేస్టు అమ్మకాలలో ఇప్పుడు మూడవ స్థానంలో ఉన్నది. ఈ మార్పుకి కారణం ప్రజలలో భారతీయ ప్రకృతి ఉత్ఫాదనలపై పెరిగిన శ్రద్ధ కారణం అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.