అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అభ్యంతరం లేదు - షియా వక్ఫ్‌ బోర్డు

వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం నిర్మాణా నికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బోర్డు ఛైర్మన్‌ వసీం రజ్వీ సోమవారం లఖ్‌నవూలో వెల్ల డించారు. దీనికి ప్రతిగా వివాదాస్పద ప్రాంతానికి దూరంగా, ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో 'మజీద్‌ ఎ అమన్‌' పేరుతో మసీదును నిర్మించాలని కోరారు. 

''1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన ప్రాంతంలో హిందువులు తాత్కాలిక ఆలయంలో దేవుని ప్రతిమను ఉంచి నిత్యం పూజలు చేస్తున్నారు. అలాంటి ప్రదేశంలో మసీదు నిర్మించాలని ఏ ముస్లిం అయినా ఎలా కోరగల డు?'' అని విలేకరుల సమావేశంలో రిజ్వీ అన్నారు. అన్య మతస్థుల ప్రార్థనా స్థలాల్లో మసీదుల ను నిర్మించరాదని ఇస్లాం కూడా చెబుతుందని తెలిపారు. భారత పురావస్తు విభాగం(ఏఎస్‌ఐ) కూడా బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు ఆ ప్రాంతంలో ఆలయం ఉండేదని నిర్ధరించినందున ముస్లింలు అయోధ్య వివాదంపై పునరాలోచించా లని కోరారు. శ్రీరాముని జన్మస్థలంలో నిర్మించిన ఆలయాన్ని బాబర్‌ సేనాని మిర్‌ బకి కూల్చి మసీదు ను నిర్మించారని తులసీదాస్‌ తన 'రామచరిత మానస్‌'లో పేర్కొన్నారని తెలిపారు. బాబర్‌ సేనాని మిర్‌ బకి షియా వర్గానికి చెందిన వాడని, ఆయన నిర్మించిన మసీదుపై షియాలకే సర్వహక్కులుంటా యని రిజ్వీ అన్నారు.