అంగర త్రివిక్రమ్‌ జీ కి పూజ్య సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌ భగవత్‌ గారి శ్రద్ధాంజలి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ జ్యేష్ట ప్రచారక్‌ శ్రీ. అంగర త్రివిక్రమ రావు జీ (76సం||) ఆగస్టు 20నాడు హైదరాబాద్‌లో స్వర్గస్తులయ్యారు. ప్రాంత సంపర్క ప్రముఖ్‌గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన త్రివిక్రమ్‌ జీ, కొంతకాలం విశ్వ హిందూ పరిషత్‌ కార్యదర్శిగా కూడా బాధ్యత నిర్వహించారు. కేశవనిలయం, భాగ్యనగర్‌లో జరిగిన శ్రద్దాంజలిలో పూజ్య సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌ జీ భాగవత్‌ మాట్లాడారు.

త్రివిక్రమ్‌ జీ ఒక తపస్వి
''నేను చాలా కాలంగా నాగపూర్‌లో ఉండడం వల్ల అఖిల భారతీయ కార్యకర్తను కావడానికంటే ముందే దేశంలోని అనేకమంది కార్యకర్తలను కలిసే అదష్టం నాకు కలిగింది. నాగపూర్‌లో తతీయ వర్ష శిక్షవర్గ కోసం శ్రీ. త్రివిక్రమ్‌ జీ వస్తుండేవారు. అలాగే పర్యటనలో భాగంగా నేను భాగ్యనగర్‌ వచ్చినప్పుడు కలుస్తుండేవారం. ఇన్నేళ్లుగా ఆయన్ని చూసిన నాకు ఆయన ఎప్పుడు ఆందోళనగా కనిపించలేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు. ఏదైనా విషయాన్ని గురించైనా ఖచ్చితంగా చెప్పేవా రు. కానీ స్వరం మదువుగానే ఉండేది, మాటలు సున్నితంగానే ఉండేవి. ఎవరు ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారో వారి మనస్సు స్వచ్ఛందంగా ఉంటుందని మన శాస్త్రాలు చెపుతు న్నాయి. ఈ లక్షణాన్ని 'ఆర్జవం' అంటారు. సంఘ ప్రచారక్‌గా ఆయన తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. ఎంతో సంవేదనశీలతతో పని చేశారు. ప్రతి ప్రచారక్‌కు ఈ సంవేదన శీలత ఉంటుంది. కానీ దీర్ఘకాలం ప్రచారక్‌గా కొనసాగడం కష్టం. మనసు, బుద్ధికి సంబంధించి అనేక క్లిష్టమైన, కష్టమైన సందర్భాలు ఎదురవుతుంటాయి. వివేకం లేకుండా కేవలం సంవేదనే ఉంటే సంతులనాన్ని కోల్పోతాం. అలాగని సంవేదన లేకపోతే ప్రచారక్‌ గా కొనసాగలేము. త్రివిక్రమ్‌ జీ ఇన్నేళ్లు సమాజం పట్ల సంవేదనతో పాటు వివేకాన్ని కూడా నిల బెట్టుకోగలిగారు. రెండు ప్రాంతాలకు (తెలంగాణ, ఆంధ్ర) చెందిన అనేక మంది స్వయం సేవక్‌లు వారి అంతిమ యాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఇది స్వయంసేవకులపై వారు చూపిన ప్రభావాన్ని మనకు తెలుపుతుంది. ఒక తపస్వి వెళ్లి పోయారు. కానీ త్రివిక్రమ్‌ జీ ఏ సంఘ కార్యాన్ని జీవితాంతం నిర్వర్తించారో దానిని మనం కొనసాగించాలి. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తరపున మనలో ఒకరైన త్రివిక్రమ్‌ జీ కి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను.' దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్‌ శ్రీ. వి. నాగరాజు జీ, ప్రచారక్‌ శ్రీ. ఎ.శ్యాం కుమార్‌ జీ, అఖిల భారతీయ సహ గోసేవా ప్రముఖ్‌ శ్రీ. అజిత్‌ మహా పాత్ర జీ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంత సంఘ చాలక్‌ లు శ్రీ. ప్యాటా వేంకటేశ్వరరావు జీ, శ్రీ. సుందర మూర్తి జీ, కేంద్ర మంత్రి శ్రీ. బండారు దత్తాత్రేయ, త్రివిక్రమ్‌ జీ కి శ్రద్దాంజలి ఘటించారు.