భారతీయుల మాదిరి జీవిస్తే అర్ధ భూ మండలం చాలు!

సహజ వనరుల వినియోగం తీరుపై ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెల్ల డించింది. ప్రపంచ వ్యాప్తంగా మనిషి అవసరాలు, కోరికలను తీర్చాలంటే నేడు 1.7భూ గ్రహాలు కావాలని 'గ్లోబల్‌ ఫుట్‌ ప్రింట్‌ నెట్‌వర్క్‌' అనే ఈ సంస్థ అంచనా వేసింది. వనరుల వినియోగం భవిష్యత్తులోనూ ఇంతే తీవ్రంగా ఉంటే 2030 నాటికి రెండు భూ మండలాలు కావాలని తెలిపింది. అందరూ భార తీయుల మాదిరి వనరులను వినియోగిస్తూ జీవిస్తే భూమి అర్ధభాగం కన్నా కొంత ఎక్కువగా (60 శాతం) ఉంటే సరిపోతుందని తెలిపింది. అమెరికన్‌ జీవన శైలిలా జీవించాలంటే మాత్రం ఐదు భూ గ్రహాలు కావాలని అంచనా వేసింది. కారణం, వారు వనరులను విపరీతంగా వినియోగించటమే. 
ఐదు నెలలు ముందే అవగొట్టేశాం! :
ఏడాది కాలానికి వనరులను ఏ స్థాయి వరకు వినియోగిస్తే భూమి తట్టుకోగలదో చెప్పే అంచనాలు ఉన్నాయి. ఆ స్థాయికి వినియోగం చేరిన రోజును 'ఎర్త్‌ ఓవర్‌ షూట్‌ డే'గా పిలుస్తారు. ఈ స్థాయి వరకైతే భూమి తిరిగి భర్తీ చేసుకోగలదు. కాని ఆ స్థాయిని దాటితే తట్టుకోలేదు. ఓవర్‌షూట్‌ డే తర్వాత రోజు నుంచి ఏడాది చివరి వరకు వనరుల వాడకంవల్ల భూమిపై పడేది భరించ లేని అదనపు భారమే. రెండు దశాబ్దాల క్రితం అంటే 1997లో ఓవర్‌షూట్‌ డే సెప్టెంబరు 30న వచ్చింది. వనరుల వినియోగం పెరిగే కొద్దీ ఇది ముందుకు జరుగుతూ వస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు 2నే వచ్చింది. అంటే ఏడాదిపాటు వాడుకోవాల్సిన వనరులను దాదాపు ఐదు నెలలు ముందుగానే అవగొట్టేశామన్నమాట! వీటిని మనిషి తీవ్రస్థాయిలో వాడేస్తుండటంతో ప్రకతిలోని ఇతర జీవజాతుల జనాభాపై పెను ప్రభావం పడుతోందని 'ప్రపంచ వన్యప్రాణుల నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)' నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. 1970నుంచి 2012మధ్య భూమిపై మత్స్య సంపద, పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, సరీసపాల సంఖ్య 58శాతం తగ్గిపోయిందన్నది.
2050 నాటికి భారత్‌లో తీవ్ర నీటి కొరత
భారత్‌లో వనరుల వాడకం తీరు జల సంక్షోభానికి దారి తీస్తోంది. దేశంలోని 20 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాల్లో 14బేసిన్లలో నీటి లభ్యతలో సమస్యలు ఎదురవు తున్నాయి. ఉపరితల జలవనరుల్లో 70శాతం కలుషితమైపోయాయి. 2050 నాటికి దేశవ్యాప్తంగా తీవ్రమైన నీటి కొరత ఏర్పడవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆర్థికాభివ ద్ధి ప్రణాళికలు, వాటి అమలు తీరు సరిగా లేకపోతే వ ద్ధి రూపంలోనూ పర్యావరణానికి గట్టి ముప్పు ఏర్పడవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌-భారత్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ సెజల్‌ వోరా హెచ్చరించారు.