కేరళ రాష్ట్రానికి చెందిన 24 సంవత్సరాల అఖిల అనే యువతిని 26 సంవత్సరాల వయస్సు ఉన్న జహీన్ అనే ముస్లిం యువకుడు వివాహం చేసుకొన్నాడు. వివాహానికి ముందు అఖిలను ఇస్లాంలోకి మతం మార్చిమరీ వివాహం చేసుకొన్నాడు. దానిపై అఖిల తండ్రి కేరళ కోర్టుకు వెళ్ళాడు; ఆ కేసు అక్కడ నుండి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో 2017 నవంబరు 27 నుండి విచారణ ప్రారంభమైంది. ఇస్లామిక్ సామ్రాజ్యవాదులు (IS) హిందు యువతులను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని ఆపైన మతం మార్చి తమ కార్యకలాపాలకు ఉపయోగించుకొంటున్నారనే అభియోగానికి సంబంధించి కేసు విచారణ ప్రారంభమైంది. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటువంటి సంక్లిష్టమైన కేసు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అని విచారణ అనంతరం వ్యాఖ్యానించారు.
కేరళ రాష్ట్రంలో గడిచిన 28 నెలల నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ (NIA) సంస్థ మతాంతర వివాహాలు చేసుకొన్న జంటలను అనేక మందిని గుర్తించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడటం జరుగుతున్నది. ఆ జంటలు వివాహం చేసుకోవటానికి దారితీసిన కారణాలపౖౖె విచారణ సాగుతున్నది. వివాహానికి ముందు వారి మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయా? ఇస్లాంకు సంబంధించిన పవిత్ర స్థలాలను సందర్శించటం జరిగిందా? వివాహానికి ముందు లేక తరువాత మతం మార్పిడి జరిగిందా? ఇట్లా కొన్ని అంశాలను ఆధారం చేసుకొని విచారణ జరుగుతున్నది. దశాబ్దాలుగా ఇస్లాం వాదులు హిందూ యువతులను ప్రలోభ పెట్టి మతం మార్చి వివాహాలు చేసుకోవటం ఒక వ్యూహం ప్రకారం నడుస్తున్నది. కేవలం కేరళలోనే కాదు దేశమంతటా జరుగుతున్నది; దానిపైన సమాచార సేకరణకు పరిస్థితులను అధ్యయనం చేయటానికి ఎన్ఐఎ ఎట్టకేలకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఇది కేరళలో కొనసాగుతున్నది. మధ్య ఆసియా దేశాలైన అరబిక్ దేశాల ఆర్థిక శక్తికి ఈ ''లవ్ జిహాద్'' కార్యకలాపాలకు ఏమైన సంబంధం ఉన్నదా? అనే కోణంలో కూడా విచారణ సాగుతున్నది. ఈ దిశలో ఎన్ఐఎ 89 కేసులు పరిశీలిస్తోంది; వాటిలో 9 కేసులకు బలమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్ఐఎ గుర్తించింది. ఈ ఆధారాలను ఆన్నింటిని సుప్రీం కోర్టుకు అందజేయటానికి రంగం సిద్ధం చేస్తున్నది. దానిలో రెండు కేసులలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించింది. ఇరాక్‌లోని ఒక ఇస్లామ్ విద్యా సంస్థ నుండి కేరళకు చెందిన ఇద్దరు యువతుల బ్యాంక్ ఎకౌంటులలో డబ్బులు వేసినట్లు గుర్తించారు. ఇంకో కేసులో మతం మారిన యువతి; ఆమె భర్తకు ఐఎస్ వాదులతో సంబంధాలు ఉన్నట్లు; వారు తమ సమీప గ్రామాలలోని యువకులను ఆకర్షించేందుకు 18 వీడియోలు చూపించినట్లుగా గుర్తించారు. కేరళ రాష్ట్రంలోనే వారు దేశం మొత్తంలో 270 మంది యువకులు; 20 మంది యువతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకొన్నారు. కేరళ తరువాత భాగ్యనగర్‌లో ఈ దిశలో కార్యకలాపాలు సాగుతున్నాయని నిర్దారణ అవుతున్నది.
భారతదేశంలో మొట్టమొదటి సారి సర్వోచ్ఛ న్యాయస్థానం మతాంతర వివాహాలలో మతమార్పిడి ఇష్టపూర్తిగా జరుగుతున్నదా? లేక వత్తిడి చేయబడుతున్నదా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నది. అఖిల (మతం మారిన తరువాత ఆమె పేరు హదియా (Hadiya) కు 24 సంవత్సరాలు. ఈ అమ్మాయి తండ్రి సంరక్షణ నుండి ప్రభుత్వ వసతి గృహానికి తరలించి ఆమెకు తన చదువు పూర్తి చేసుకొనివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానిపైన విచారణ జరుగుతున్నది. ఈ కేసులో ముస్లిం యువకుడైన జహీన్ పక్షాన కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన కపిల్ సిబాల్ కూడా పాల్గొంటున్నాడు. ఇది కాంగ్రెసు మార్క్ రాజకీయం.
''లవ్ జిహాద్'' గురించి మాట్లాడుతున్నది ఆర్ఎస్ఎస్; బిజెపివాళ్ళు మాత్రమేనని; వాళ్ళు కేరళ రాష్ట్రంలో హిందుత్వ ఆదిపత్యం కోసం చేస్తున్న స్టంట్ ఇది అని కాంగ్రెసు వాదులు; కమ్యూనిస్టులు ప్రచారం చేస్తున్నారు. యమ్.బి.రాజేశ్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఇదంత ఆర్ఎస్ఎస్ తన అధిపత్యం కోసం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. కేరళలో హిందువులపై జరుగుతున్న దాడుల నుండి కాపాడుకొనటానికి నందకుమార్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త హిందూ హక్కుల సమితి తరఫున హిందువులను చైతన్యవంతం చేస్తున్నారు.
13% ముస్లిం జనాభా కలిగిన రాష్ట్రం కేరళ. అందుకే ముస్లింలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. దానిని నిరోధించేందుకు అక్కడి హిందూ సమాజం గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నది. దానితో రూట్ మార్చి లవ్ జిహాద్ లోకి దిగారు ఇస్లాం వాదులు. ఇంత ఆర్.ఎస్.ఎస్. మీద ప్రచారం చేస్తున్న పార్టీల పాలనలోనే కేరళ నుండి 160 మంది యువకులు సిరియా; ఇరాక్; ఆప్ఘనిస్థాన్ ఉగ్రవాద శిబిరాలలో చేరిపోయి శిక్షణ పొంది ఇస్లామిక్ ఉగ్రవాదులుగా మారారని విచారణలో అధికార పూర్వకంగా తేలినట్లు అందరికి తెలుసు. అయినా ఇటువంటి ఆరోపణలు ఆర్ఎస్ఎస్పై చేయటం వారి నైజం.
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు దేశమంతట మూడు ప్రయత్నాలు గట్టిగా జరుపుతున్నారు. 1) మతం మార్పిడుల వేగం పెంచటం, 2) లవ్‌జిహాద్, 3) ఇస్లామిక్ సామ్రాజ్యం నిర్మాణానికి ఐఎస్ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు బలం చేకూర్చడం. మతం మార్పిడులకు అనేక మార్గాలు. ఇటువంటి పరిస్థితులను అదుపుచేయటానికి ఆయా మార్గలో ఏమి చెయ్యాలో ఆలోచించవలసిన అవసరం ఉంది. హిందూ సమాజం మేల్కొలపాల్సిన అవసరం ఉంది. గుర్తించాలి.