గృహవైద్యం - జామకాయ

జామకయకి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. జామకాయ ప్రతీ ఇంటిలోనూ, ప్రతీ వారికి సుపరిచితమైన ఔషధం. జాయకాయ ఆకులు, కాయలు, పండ్లు, బెరడు అన్నీ ఆయుర్వేద ఔషధంగా పనికి వస్తాయి. ఆకులు నీళ్ళతో కలిపి కషాయంగా కాచుకొని తాగితే బీ.పీ., శుగర్‌, కడుపులో నూలు పురుగులు అన్నీ మటుమయమవుతాయి.
ఆ జమకాయలలో ఎంతో పీచు పదార్థం ఉంటుంది. దానివలన మలబద్ధకం ఉండదు.

బరువు తగ్గాలనుకున్న యువతీ యువకులు ఈ పండును నిశ్చింతగా తినవచ్చును. ఎందుకంటే విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్‌ ఎంతో అధికంగా లభించే పండు. అదీ కాకుండా కొలస్ట్రాల్‌ ఫ్యాట్‌ లేని చక్కటీ ఔషధం.

ఈ జామకాయలో విటమిన్‌-సి ఆరంజ పండు కంటే కూడా అయిదు రెట్లు అధికంగా ఉంటుంది.

కంటికి సంబంధించిన వ్యాధులని చక్కగా నివారిస్తుంది.

బీ.పీ.కి మంచి ఔషధము.

అంతే కాకుండా కాపర్‌, మెగ్నీషియం అధికంగా లభిస్తాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే జామకాయ, జామపండు నరాలకి మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది.