నిమ్మకాయ (నిమ్మ ఆకు)

ఇది ప్రతి ఇంటిముందు, లేక తోటలో ఉండే మొక్క. దీనికి పరిచయం అక?రలేదు. అలా అని పట్టించుకోకపోయినా మన ఆరోగ్యానికి ఎంతో నష్టం.
-    నిమ్మ ఆకుల రసం, లేక నిమ్మ ఆకులు వేసి తోడు పెట్టిన మజ్జిగ చాలా చలవ చేస్తుంది

-    నిమ్మకాయలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దానివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తత్ఫలితంగా ఎన్నో క్రిమికీటాదులు మన శరీరాన్ని బాధించ కుండా ఉంటుంది

-    నిమ్మకాయ రసం, నీళ్ళు, ఉప్పు, పంచదార కలిపిన పానీయం త్రాగితే ఒక సెలైన్‌ సీసా పుచ్చుకున్నంత బలం వస్తుంది.

-    నిమ్మకాయలో కెరోటిన్‌ అన్న రసాయనం వల్ల రక్తశుద్ధి కలిగి శరీరానికి మంచి కాంతి వస్తుంది.

-    ఎండపెట్టిన నిమ్మకాయపొడి ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.

ఈ విధంగా నిమ్మకాయ చేసే మేలు అంతా-ఇంతా కాదు. కాబట్టి అందరూ నిమ్మకాయలను వృధా చేసుకోకుండా రోజూ వాడడం వలన ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది.