ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)


ఇది కీళ్ళకి సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రారంభం లో అంతగా బాధ ఉండదు. అందుకని మనం అందరం దానిని చిన్నదే అని వదిలేస్తాము. కానీ  దీర్ఘకాలంలో మాత్రం కీళ్ళలో బిరుసుదనం (stiffness), వాపులు బొత్తిగా కదల లేకపోవడం వంటి లక్షణాలు బాగా తెలియవస్తూంటాయి..

కానీ ఇది ఎందుకు వస్తుందో కొంచెం తెలుసు కుందాం. అలాగే ఎలాగ దాన్ని నివారించవచ్చు కూడా చూద్దాం.

కారణం : ఈ క్రింది కారణాల వలన ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయి.

వాత-ప్రకోపం (అధికం అవ్వడం)

ఆమ (పూర్తిగా అరగని పదార్ధం)

అధిక మోతాదులో పులిసిన వాయువు వెళ్లి కీళ్ళల్లో నిలిచిపోవడం, ఎక్కువగా తినడం, సన్నని శరీర ఆకృతి, మలబద్ధకం వలన అజీర్తి.

నివారణ : మలబద్ధకం లేకుండా చూసుకోవాలి, ఆమని పూర్తిగా తొలగించుకోవాలి

చిట్కాలు : నిమ్మకాయ రసం, తేనె  ఒక గ్లాసుడు నీళ్లలో రోజుకు రెండు సార్లు తీసుకోవడం

వంకాయని బాగా కాల్చి గుజ్జుకు ఆవనూనెతో పోటు జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, ఉప్పు వేసి రోజుకు రెండుసారులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా మూడు నెలలు తీసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది. ఒక గ్లాసుడు నీళ్లలో 1 పెద్ద చంచా పసుపు కలిపి రోజూ త్రాగాలి. ఒక వెల్లులి రెక్కను పచ్చిగా పరగడుపున తినాలి. నువ్వుల నూనెలో కర్పూరం వేసి  నొప్పులు ఉన్నచోట మర్దన చేయటం వల్ల మంచి ఫలితం ఇస్తుంది.

దుకాణం దొరికే మందులు :- గుగ్గులు

వీటితో పాటు కొబ్బరినీళ్ళు, బీట్రూట్‌ రసం, కారెట్‌ రసం త్రాగడం, అలాగే గుమ్మడి కాయని తరచూ తీసుకోవడం, అట్లానే జీలకఱ్ఱ, వెల్లుల్లి కూడా చాలా సహాయపడుతుంది.