ప్రముఖులు మాట



అసోంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి) అంతిమ జాబితా కాదు. ఇది ముసాయిదా మాత్రమే. పౌరులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

 - రాజ్‌ నాధ్‌ సింగ్‌ , కేంద్ర హోమ్‌ మంత్రి



ఏ భారతీయుడి పేరు జాబితా నుండి తొలగించే ప్రసక్తి లేదు. 1985 రాజీవ్‌ ఒప్పందం ప్రకారమే, సుప్రీం కోర్ట్‌ ఆదేశాల మేరకే పౌర రిజిస్టర్‌ తయారు చేస్తున్నాం. దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులకు వంతపాడాలని ఎవరు చెప్పినా అంగీకరించబోము. జాతీయ భద్రత కోసమే ఈ నిర్ణయం.

- అమిత్‌ షా, బిజెపి జాతీయాధ్యక్షుడు

 
ప్రజల వ్యహారశైలిని మార్చే ఉద్యమాలలో స్వచ్ఛ భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్దది, విజయవంతమైనది. దీని ద్వారా భారతదేశంలో ఎంతో మార్పు కనిపిస్తోంది.

- వాల్‌ కర్టీస్‌, డైరెక్టర్‌,  పర్యావరణ ఆరోగ్య సంస్థ, లండన్‌